జనసేన కి ఇండైరెక్ట్ గా ప్రచారం చేస్తున్న తేజు..!

మొన్నటికి మొన్న నిహారిక ‘సూర్యకాంతం’ ప్రమోషన్లలో భాగంగా… ‘మా బాబాయి కోసం కేకలు వేస్తే మీకేమీ రాదు… ఈ సారి ఎన్నికల్లో ఓటెయ్యండి, బాబాయ్ ను గెలిపించండి అంటూ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీకి ప్రచారం చేసింది.అంతే కాదు తను టీ గ్లాస్ పట్టుకున్న ఫోటోని ఎన్నికలయ్యే వరకూ తన సోషల్ మీడియా అకౌంట్ లలో ఉంచుతానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మెగా హీరోలందరూ వారి వారి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ఏదో ఒక రకంగా జనసేన కి ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సాయి ధరమ్ తేజ్ కూడా చేరిపోయాడు.

తాజాగా తను హీరోగా నటించిన ‘చిత్రలహరి’ చిత్ర ప్రమోషన్లలో భాగంగా… తన చిన మామయ్య పార్టీ జనసేన ప్రచారం చేస్తున్నాడు. జనసేన పార్టీ గుర్తయిన గ్లాసుని చూపిస్తూ ‘చిత్రలహరి’ కి సంబందించిన పోస్టర్ ని విడుదల చేశాడు. ఈ చిత్రంలో ‘గ్లాస్‌మేట్స్‌’ అనే పాట ఉంది. ఆదివారం సాయంత్రం 7గంటలకు ఈ పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ పోస్టర్ లో సేమ్ జనసేన గాజు గ్లాసు గుర్తును చూపిస్తూ.. సాయి ఇన్ డైరెక్ట్ గా ప్రమోట్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఇక ఈ సాంగ్ లో కూడా ఎలాంటి లిరిక్స్ ఉంటాయో అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Share.