సిక్స్ కొట్టిన “స‌చిన్‌ : ఎ బిలియ‌న్ డ్రీమ్స్” ట్రైలర్

క్రికెట్ అభిమానులు దేవుడిగా చూసుకునే  మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ జీవిత చ‌రిత్ర‌ ఆధారంగా తెరకెక్కిన ‘స‌చిన్‌: ఎ బిలియ‌న్ డ్రీమ్స్’ అనే చిత్రం ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయి ఆకట్టుకుంది. 130 సెకన్ల ఈ వీడియోలో సచిన్ జీవితంలోని మధురఘట్టాలను పరిచయం చేశారు. జేమ్స్ ఎర్‌స్కైన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ బయోపిక్ కమర్షియల్ హిట్ సాదిస్తుందని ట్రైలర్ చెప్పకనే చెప్పింది. వరల్డ్ కప్ ని తన చేతులతో అందుకోవాలనే కలను ఎలా నేర వేర్చుకున్నారో సచిన్ వివరించడం హైలెట్ కానుంది.

క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టేటప్పుడు గుడిలోకి వెళ్లినట్లుగా భావిస్తానని సచిన్ చెప్పడం మనసుకు హత్తుకుంది. ర‌వి భ‌గ్‌చంద్కా, కార్నివాల్ మోష‌న్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి  ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ సంగీతమందించారు. సచిన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ మే 26న థియేటర్లలోకి రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.