అఫీషియల్ రిలీక్ కి ముందే లీకైన సాహో కొత్త స్టిల్

ఒక మీడియం బడ్జెట్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా ఏదైనా కొత్త స్టీల్ రిలీజ్ చేయాలంటేనే సోషల్ మీడియాలో ఒక రెండు రోజుల ముందు నుంచీ జరిగే రచ్చ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అలాంటి యావత్ భారతీయ చిత్రసీమ ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్న “సాహో” సినిమాకి సంబంధించిన ఒక స్టిల్ రిలీజ్ అవుతుంది అంటే ఇంకెంత క్రేజ్ ఉండాలి. అలాంటిది ఎలాంటి చడీ చప్పుడు లేకుండా.. ఆన్లైన్ లో ప్రత్యక్షమైన “సాహో” కొత్త స్టిల్ ప్రభాస్ ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది.

one-more-leak-from-saaho-movie1
సాహోలోని ఏదో ఒక రోమాంటిక్ సాంగ్ లో శ్రద్ధా కపూర్ కళ్ళల్లో కైపుగా చూస్తున్న ప్రభాస్ ఫోటో నిన్నట్నుంచి ఆన్లైన్ లో తెగ హల్ చల్ చేసింది. కానీ.. ఇది అఫీషియల్ గా టీం రిలీజ్ చేసిన స్టిల్ కాదు. ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు కానీ.. లీకైందని మాత్రం అర్ధమైంది. అసలు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆత్రంగా వెయిట్ చేస్తున్న ఈ సినిమా పోస్టర్ కానీ స్టిల్స్ కానీ ఆఫీషియల్ గా కాకుండా ఇలా లీకవుతుండడం ప్రభాస్ అభిమానుల్ని బాధపెడుతోంది. మరి సాహో బృందం ఇంకాస్త జాగ్రత్తగా ఉండడం బెటర్.

Share.