అలసటనేది నేను ప్రభాస్ లో ఇప్పటివరకూ చూడలేదు : కెన్నీ బేట్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ చిత్రంతోనే బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రం 40శాతం షూటింగ్ పూర్తి చేసినప్పుడే తన 20 వ చిత్రాన్ని కూడా మొదలుపెట్టేశాడు ప్రభాస్. అయితే ప్రస్తుతం ‘సాహో’ చిత్రాన్ని శరవేగంగా పూర్తిచేయాలని ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడట. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరెక్కబోతుంది. శర్వానంద్ తో ‘రన్ రాజా రన్’ వంటి ఫన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించిన సుజీత్ ‘సాహో’ చిత్రాన్ని తెరకెక్కిన్నాడు. గత కొద్ది కాలంగా రామోజీ ఫిలింసిటీలో ఈ చిత్రానికి సంబందించిన భారీ యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారు.

ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ ‘కెన్నీ బేట్స్’ యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేస్తున్నాడు. ఇటీవల అయన .. “యాక్షన్ ఎపిసోడ్స్ లో ప్రభాస్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. సాధారణంగా హై రిస్క్ ఉండే యాక్షన్ సీన్స్ చేసిన తరువాత చాలామంది హీరోలు అలసిపోతూ చాలా రోజులు గ్యాప్ తీసుకుని షూటింగ్ కి హాజరుకారు. అలాంటిది అలసట నేను ఇంతవరకూ ప్రభాస్ లో చూడలేదు. ఉదయాన్నే సెట్స్ కి వచ్చినప్పుడు ఆయన ఎలా అయితే ఉత్సాహంగా ఉంటాడో .. ఆ రోజంతా కూడా ఆయన అంతే ఉత్సాహంగా ఉంటాడు. యాక్షన్ సీన్స్ చేసే విషయంలో ఆయనకి ఎంతమాత్రం సందేహం లేకపోవడం .. బెదురు లేకపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది” అంటూ చెప్పుకొచ్చాడు.

Share.