ప్రభాస్ సాహో సినిమా స్టోరీ ఇదేనంటూ ప్రచారం!

యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సాహో మూవీ విజయవంతంగా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. బాహుబలి స్టార్ ప్రభాస్ పక్కన నటిస్తున్న శ్రద్ధా కపూర్ ఈ విషయాన్నీ ట్విట్టర్లో అధికారికంగా వెల్లడించింది. ఇలా మొదటి షెడ్యూల్ పూర్తి అయిందో లేదో.. ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ.. సోషల్ మీడియాలో ఓ కథ చక్కర్లు కొడుతోంది.  పునర్జన్మ నేపథ్యంగా కథ సాగుతుందని సమాచారం. తొలి షెడ్యూల్‌లో షూట్ చేసిన సన్నివేశాల ప్రకారం సినిమా బ్రిటీష్ కాలంలో మొదలవుతుందట. షూటింగ్ స్పాట్‌లో బ్రిటీష్ జెండాలు ఉండడం ఈ కథకి బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఈ షెడ్యూల్‌లో స్వాతంత్య్రానికి  పూర్వం నాటి  సీన్లను షూట్ చేసినట్టు తెలిసింది. వందకు పైగా గుర్రాలతో ఓ భారీ యాక్షన్ సీన్‌ను కంప్లీట్ చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. బ్రిటిష్ కాలంలో మరణించిన ప్రభాస్, శ్రద్ధాలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభాస్, శ్రద్ధా మళ్లీ పుడతారని, తమని వెన్నుపోటు పొడిచిన వారిని అంతమొందిస్తారనే కథ ప్రచారంలో ఉంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Share.