అమీర్ పేటలో ప్రభాస్ ఫైట్!

యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ముందే టీజర్ రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. అభిమానుల అంచనాలకు మించి ఈ సినిమాని డైరక్టర్ తెరకెక్కిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు 200  కోట్ల బడ్జెట్ తో ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాకోసం రామోజీ ఫిలిం సిటీలో 5 కోట్లు వెచ్చించి భారీ సెట్ నిర్మించారు. గత పది రోజులుగా అక్కడే షూటింగ్ జరిగింది. ఈ రోజు నుంచి అమీర్ పేటలో సాగుతోంది. అమీర్ పేటలోని ఓ మంచి ప్రదేశంలో వేసిన ఇంటి సెట్ లో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు.

ఈ చిత్రీకరణలో హీరోయిన్ శ్రద్ధ కపూర్ కూడా పాల్గొంటున్నారు. ప్రియురాలితో ముచ్చట్లో మునిగి ఉన్న సమయంలో ప్రభాస్ పై  విలన్స్ దాడి చేయగా వారిని ఎదుర్కొనే యాక్షన్ సీన్ ఇదని తెలిసింది. ఇక్కడ షూటింగ్ పూర్తికాగానే చిత్ర బృందం దుబాయ్ కి వెళ్లనుంది. బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే, కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లోకి రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.