బయోపిక్ లో నటించడానికి రెడీ అవుతున్న పాయల్ రాజపుత్..!

‘ఆర్.ఎక్స్.100’ బ్యూటీ పాయల్ రాజ్ ఫుత్ తన అందాల ఆరబోతతో ఆ చిత్రాన్ని ఎంత పెద్ద హిట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఎదురుగా ఉంటే నిజంగా కొట్టాలి అనిపించే రేంజ్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం పాయల్ రవితేజ సరసన ‘డిస్కో రాజా’ అనే చిత్రంలో నటించబోతుంది. దేనితో పాటూ వెంకటేష్ నాగచైతన్యల క్రేజీ మల్టీ స్టారర్ ‘వెంకీమామ’ చిత్రంలో కూడా నటిస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ బయోపిక్ లో నటించడానికి పాయల్ రెడీ అవుతుందట.

వివరాల్లోకి వెళితే ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘దొంగాట’ ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ ను హీరోయిన్ గా ఎంచుకున్నారని తెలుస్తోంది. దీనికి సంబధించిన అగ్రీమెంట్ ను కూడా చేసుకోబోతుందట ఈ చిత్రయూనిట్. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నారని సమాచారం. స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు రాస్తున్నారని తెలుస్తుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్టు కూడా టాక్ నడుస్తుంది.

Share.