తిరిగి షూటింగ్ ప్రారంభం కానున్న ‘ఆర్.ఆర్.ఆర్’?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్నప్పటికీ రెండో షెడ్యూల్ మాత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇందులో చరణ్, ఎన్టీఆర్ లకు గాయాలు పాలవ్వడం ఓ కారణమైతే రెండోది ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా అనుకున్న డైసీ ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకోవడం రెండో కారణం. ఈ కారణాల వల్ల ఈ చిత్రం షూటింగుకి కొన్ని వాయిదా పడుతూ వచ్చింది.

అందుతున్న సమాచారం ప్రకారం… అతిత్వరలో తిరిగి ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుందని తెలుస్తుంది. హైదరాబాద్ – అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం కోసం భారీ సెట్ వేశారంట. ఈ సెట్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ .. చరణ్ .. అలియా భట్ తదితరులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటారట. గ్యాప్ లేకుండా ఇక ఈ షూటింగ్ ను తెరకెక్కించాలనే ప్లాన్లో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తుంది.

Share.