చెన్నై వాసులు చెబుతున్న రోబో 2.O కథ!

శంకర్, రజనీకాంత్ కలయికలో వస్తున్న మూడో సినిమా రోబో 2.O. దీంతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఏడాదిగా శ్రమిస్తున్నారు. నిన్నటి నుంచి ఓ పాటను మొదలెట్టారు. ఈ సాంగ్ ని 11  రోజుల పాటు షూట్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఇది రోబో సినిమాకి సీక్వెల్ కాదని శంకర్ స్పష్టం చేశారు.  చెన్నై వాసులు మాత్రం  రోబో 2.O కథ ఇదేనంటూ చెబుతున్నారు. ” అక్షయ్‌కుమార్‌ కి పక్షులు, జంతువులు అంటే ప్రేమ. ప్ర‌పంచంలో ఎన్నో ర‌కాల అరుదైన ప‌క్షుల‌ను అత‌డు ప్రేమ‌తో పెంచుకుంటూ ఉంటాడు. అయితే అవి చ‌నిపోతూ ఉంటాయి. ఎందుకు చనిపోతున్నాయని పరిశోధిస్తే పెరుగుతోన్న టెక్నాల‌జీ కారణమని  తెలుస్తుంది.

దీంతో అత‌డు టెక్నాల‌జీపై కోపం పెంచుకుని, వాటికీ గురించి తెలుసుకుంటూ ఓ కోపం కలిగిన మరమనిషిలా మారిపోతాడు. సైంటిస్ట్ అయిన ర‌జనీకాంత్‌ అవినీతిని అంతం చేసేందుకు ఓ రోబోను క‌నిపెడ‌తాడు.  సైంటిస్ట్‌, అత‌డు కనిపెట్టిన రోబో, ఆ పక్షి ప్రేమికుడు మధ్య జరిగే సంఘర్షణల మిళితమే రోబో 2.O” అని వివరిస్తున్నారు. ఈ కథకి శంకర్ విజువలైజేషన్ మరింత అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆ అద్భుతాన్ని చూసేందుకు వచ్చే ఏడాది జనవరి 25 వరకు ఆగాలి. అప్పుడే 2.O థియేటర్లోకి రానుంది.

Share.