రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన బయో పిక్స్!

కల్పిత గాధలనే నిజంగా జరిగినట్టు చూపించడమే కాదు.. వాస్తవంగా జరిగిన సంఘటనలు దగ్గరుండి కెమెరా కంటి ద్వారా చూపించడంలో రామ గోపాల్ వర్మ దిట్ట. ఆయన దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర, వీరప్పన్, వంగవీటి సినిమాలే అందుకు నిదర్శనం. అంతేకాదు మరికొన్ని బయో పిక్స్ తెరకెక్కించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అలా వర్మ మెగా ఫోన్ నుంచి వచ్చిన, రాబోతున్న జీవిత చరిత్ర సినిమాలపై ఫోకస్…

నాథురాం గాడ్సే 1-nathuram-godseజాతి పిత మహాత్మ గాంధీని చంపిన వ్యక్తి నాథురాం గాడ్సే . అతని జీవిత గాథ ఆధారంగా సినిమా రూపొందిస్తానంటూ వర్మ గతంలో ప్రకటించారు. ఈ మూవీ గురించి చెప్పి కొన్నేళ్లు అవుతున్నా ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందా? అని వర్మ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

న‌యీమ్2-rgv-nayeemతెలంగాణలో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీముద్దీన్ ఉర‌ఫ్ న‌యీమ్‌ ని పోలీసులు చాకచక్యంగా చంపేశారు. న‌యీమ్ నేర చ‌రిత్ర చాలా పెద్దదని మీడియా ద్వారా తెలుసుకున్న వర్మ అతనిపై సినిమాని తీస్తానని ప్రకటించారు. ఒక పాట కూడా ట్యూన్ కట్టారు. ఆ పాట, ఫ్యాన్స్ డిజైన్ చేసిన పోస్టర్ సంచలనం సృష్టించింది.

రెడ్డిగారు పోయారు3-reddy-garu-poyaruఆంధ్రప్రదేశ్ లో రెడ్డి కులానికి ప్రత్యేక హోదా ఉంది. ఆ కులాన్ని బేస్ చేసుకొని, ఒక మహా నేత ప్రమాదంలో చనిపోయిన విషయాన్నీ జత కలిపి “రెడ్డిగారు పోయారు” అనే సినిమా తీస్తున్నట్లు 2014 ఎన్నికల ముందు ప్రకటించారు. పోస్టర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ 2019 నాటికైనా రాకపోతుందా.. అని ఎదురుచూసే వారు లేకపోలేదు.

శశికళ4-sashikalaతమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోవడంతో ఆ రాష్ట్రం రాజకీయాల్లో అనేక మలుపులు జరిగాయి. అప్పుడు వార్తల్లో జయలలిత మిత్రురాలు శశికళ పేరు బాగా వినిపించింది. ఆ సమయంలో శశికళ జీవితంపై సినిమా చేస్తానని వర్మ ప్రకటించారు. ఆమె జీవిత గాధను వెండితెరపై చూడాలని తమిళియన్ల ఆశపడుతున్నారు. వారి ఆశను వర్మ ఎప్పుడు తీరుస్తారో చూడాలి.

రక్త చరిత్ర5-rakta-charitraరాయలసీమలో మంచి పేరున్న పరిటాల రవి పై రక్త చరిత్ర అని సినిమా తీసి వర్మ వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ఈ సినిమాని రెండు పార్టులుగా తీసి, బయోపిక్ కి కమర్షియల్ హంగులు జోడించి కలక్షన్ల వర్షం కురించారు.

వంగవీటి6-vangaveetiవిజయవాడలో రెండు వర్గాల పోరుని వంగవీటి అనే సినిమా ద్వారా తెరకెక్కించారు. ఇందులో వంగవీటి రాధా, దేవినేని నెహ్రూ తో పాటు చాలామంది జీవిత గాధలను చూపించారు. అనేక విమర్శలు, బెదిరింపులు ఎదుర్కొన్నప్పటికీ రిలీజ్ చేసి దట్ ఈజ్ వర్మ అని అనిపించుకున్నారు.

కిల్లింగ్ వీరప్పన్7-killing-veerappanకర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను గడగడలాడించిన వీరప్పన్ పై పరిశోధించి కిల్లింగ్ వీరప్పన్ అనే సినిమాని వర్మ అద్భుతంగా తెరకెక్కించారు. అనేక భాషల్లో ఈ మూవీ విజయం సాధించింది.

ఎన్టీఆర్8-ntr-bioepicతాజాగా వర్మ మహా నటుడు నందమూరి తారకరామారావు బయోపిక్ ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. తెలుగు ప్రజలకు ఆరాధ్య దేవుడైన ఎన్టీఆర్ ని వెండితెరపై ఏ విధంగా చూపిస్తారోనని అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.

Share.