బాలయ్యకి వెన్నుపోటు పొడిచేయ్ రాణా అంటున్న ఆర్జీవి

రేపు “ఎన్టీఆర్ మహానాయకుడు” సినిమా ఎలాంటీ హడావుడి లేకుండా చాలా సింపుల్ గా రిలీజావుతుంది. ఈ సినిమా మీద భారీగా కాకపోయినా ఓ మోస్తరు అంచనాలున్నాయి. కానీ.. సాధారణ ప్రేక్షకులంటే ఎక్కువగా మన రాంగోపాల్ వర్మ ఈ సినిమాపై ఎక్కువ అంచనాలు పెట్టుకొన్నాడు. ముఖ్యంగా.. ఈ సినిమాలో ట్రైలర్, స్టిల్స్ ను తన సినిమా ప్రమోషన్స్ కోసం వాడేసుకొంటున్నాడు. నిన్న వర్మ “ఎన్టీఆర్ మహానాయకుడు” సినిమా కొత్త పోస్టర్ ను షేర్ చేస్తూ.. “రాణా ఎప్పుడు కత్తి పట్టుకొని బాలయ్యను వెన్నుపోటు పోడుస్తాడా అని వెయిట్ చేస్తున్నాను” అని ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో ఉన్న వెటకారం పక్కనపెడితే.. ఆల్మోస్ట్ అందరూ బాగా కనెక్ట్ అయ్యారు.

అయితే.. సినిమాలో చంద్రబాబు పాత్ర ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచే సీన్స్ ఏమీ లేవని, ఆ తరహా కథనం కూడా లేదని.. అందుకే వర్మ ఇలా ఎద్దేవా చేస్తున్నాడని టాక్. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే రేపటి వరకూ వెయిట్ చేస్తే సరిపోతుందనుకోండి. కానీ.. ఆర్జీవీ ఇలా బాలయ్యను అదే పనిగా టీజ్ చేయడం అనేది మాత్రం అస్సలు మంచిది కాదు అని కొందరు అభిప్రాయం. ఇప్పుడంటే సినిమా రిలీజ్ ఉందని బాలయ్య సైలెంట్ ఉన్నాడేమో కానీ.. తర్వాత ఊరుకోడనే విషయాన్ని ఆర్జీవీ గ్రహించాల్సిన అవసరం చాలా ఉంది.

Share.