ఎన్టీఆర్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి గురించి వర్మ చెప్పిన నిజాలు..!

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాల్లో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ వృద్ధ వయసు పాత్రలో పర్వాలేదనిపించినా… ఎన్టీఆర్ యుక్త వయసులో ఉన్న పాత్రకి మాత్రం బాలయ్య సెట్ అవ్వలేదనే కామెంట్స్ వినిపించాయి. దీంతో ఆరంభం నుండీ ఆ ప్రాజెక్ట్ పై ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో మాత్రం అచ్చం ఎన్టీఆర్ లా ఉండే వ్యక్తిని తీసుకొచ్చేసాడు. విడుదలైన రెండు ట్రైలర్లలో అచ్చం ఎన్టీఆర్ లనే నటించేస్తున్నాడు ఈ వ్యక్తి.

ఎన్టీఆర్ హావభావాల్ని అచ్చు గుద్దినట్టు అలానే దింపేస్తున్నాడు… ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు అనే గా మీ డౌట్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ పాత్ర చేసిన వ్యక్తి పేరు విజయ్ కుమార్. ఇతను ఓ రంగస్థల నటుడు. విజయ్ కుమార్ రెండు నెలల పాటూ వర్మ దగ్గర ట్రైనింగ్ తీసుకుని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో నటించినట్టు వర్మ తెలిపాడు. ఎన్టీఆర్ పాత్రని ఎవరైనా పేరున్న నటుడు చేస్తే .. ఆ పాత్రలో వాళ్ళే కనిపిస్తారని.. కొత్త వాళ్ళైతే ప్రేక్షకుడికి బిలీవబిలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ కనిపిస్తుందని వర్మ చెప్పుకొచ్చాడు. ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం మర్చి 29 న విడుదల కాబోతుందని కూడా స్పష్టం చేసాడు.

Share.