పవన్ కల్యాణ్ బయో పిక్ తెరకెక్కించనున్న రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద ట్వీట్స్ తో ఎప్పుడూ వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ మరో మారు వార్తల్లోకెక్కారు. పవన్ కళ్యాణ్ పై సినిమా తీస్తానంటూ ఆయన అభిమానులకు షాక్ ఇచ్చారు. వర్మకి మెగాస్టార్ కుటుంబ సబ్యులకు ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుక నుంచి మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ పై కూడా కొన్ని సార్లు పొగుడుతూ, కొన్ని సార్లు తిడుతూ ట్వీట్స్ చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. రీసెంట్ పవన్ తో పాటు మెగా కుటుంబ సభ్యులందరికీ క్షమాపణలు కూడా చెప్పారు. దీంతో వివాదం ముగిసిందని అనుకోగానే వర్మ బయోపిక్ అంటూ చర్చకు తెరలేపారు.

ప్రస్తుతం వర్మ అమితాబ్ బచ్చన్ హీరోగా సర్కార్ 3 సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ త్వరలో థియేటర్లోకి రానుంది . ఈ  సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో మీ నెక్స్ట్ ప్రాజక్ట్ ఏమిటని ప్రశించగా.. సర్కార్ 3 రిలీజ్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ బయోపిక్ ని రూపొందిస్తానని చెప్పారు. గతంలో వర్మ చేసిన బయో పిక్స్ రక్త చరిత్ర, వంగవీటి సినిమాలు వివాదాలకు కేంద్ర బిందువయ్యాయి.  మరి ఈ సినిమా ఎన్ని వివాదాలను రేకెత్తిస్తుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.