రామ్ గోపాల్ వర్మ పేరు ప్రకటించి ఆగిపోయిన సినిమాలు

రామ్ గోపాల్ వర్మ సినిమాలు మాత్రమే కాదు, ఆయన మాటలు కూడా డిఫెరెంట్ గా ఉంటాయి. దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా దానికి కనెక్ట్ అయిపోతారు. వెంటనే దానిపై సినిమా తీస్తానని ప్రకటించేస్తారు. టైటిల్, పోస్టర్ వెంట వెంటనే రిలీజ్ అయిపోతాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ ? అంటే మాత్రం సమాధానం ఉండదు. అలా రామ్ గోపాల్ వర్మ ప్రకటించి .. ఆగిపోయిన సినిమాలపై ఫోకస్..

శ్రీదేవి Sridevi Movieరామ్ గోపాల్ వర్మకి శ్రీదేవి అంటే చాలా ప్రేమ. అందుకే ఆపేరుతో ఒక టీచర్ కథను తీస్తానని వరుసగా పోస్టర్స్ వదిలారు. ఆ పోస్టర్ యువతను పిచ్చెక్కించాయి. అటు టీచర్స్, ఇటు శ్రీదేవి వర్మపై విరుచుకు పడడంతో ఆ మూవీ అడ్రస్ లేకుండా పోయింది.

శశికళ Sasikala Movieతమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోవడంతో ఆ రాష్ట్రం రాజకీయాల్లో అనేక మలుపులు జరిగాయి. అప్పుడు వార్తల్లో జయలలిత మిత్రురాలు శశికళ పేరు బాగా వినిపించింది. ఆ సమయంలో శశికళ జీవితంపై సినిమా చేస్తానని వర్మ ప్రకటించారు. ఆ తర్వాత ఆ ఊసే లేదు.

రెడ్డిగారు పోయారు Reddy Garu Poyaruఆంధ్రప్రదేశ్ లో రెడ్డి కులానికి ప్రత్యేక హోదా ఉంది. ఆ కులాన్ని బేస్ చేసుకొని, ఒక మహా నేత ప్రమాదంలో చనిపోయిన విషయాన్నీ జత కలిపి “రెడ్డిగారు పోయారు” అనే సినిమా తీస్తున్నట్లు 2014 ఎన్నికల ముందు ప్రకటించారు. పోస్టర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆ పదం కూడా వర్మ నోటా రాలేదు.

పట్ట పగలు Patta Pagaluహారర్ సినిమాలు తీయడంలో వర్మకి మంచి ప్రతిభ ఉంది. రాత్రి సినిమాతో అందరినీ భయపెట్టిన రాము “పట్టపగలు” అనే పేరుతో హారర్ మూవీ తీస్తానని చెప్పారు. పోస్టర్ తో భయపెట్టారు కూడా. కానీ థియేటర్లోకి రాలేదు. అసలు షూటింగే జరుపుకోలేదు.

నయీమ్Nayeemతెలంగాణలో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీముద్దీన్ ఉర‌ఫ్ న‌యీమ్‌ ని పోలీసులు హ‌త‌మార్చారు. న‌యీమ్ నేర చ‌రిత్ర చాలా పెద్దది అని మీడియా ద్వారా తెలుసుకున్న వర్మ అతనిపై సినిమాని తీస్తానని ప్రకటించారు. ఒక పాట కూడా ట్యూన్ కట్టారు. ఆ తర్వాత ఆ మూవీ చరిత్రలో కలిసిపోయింది.

మొగలి పువ్వు Mogali Puvvuస్మార్ట్ ఫోన్ కాలంలో అమ్మాయిలు ఎలా అబ్బాయిలను ట్రాప్ చేస్తున్నారు అనే అంశంపై మొగలి పువ్వు అనే సినిమా తీస్తానని ప్రకటించారు. ఆ సినిమా ఏమైందో రామ్ గోపాల్ వర్మకి కూడా తెలియదేమో..!

బ్రూస్లీ Bruse Leeశ్రీదేవి తర్వాత వర్మ ఇష్టపడే వ్యక్తుల్లో బ్రూస్లీ ఒకరు. ఆ ఇష్టంతోనే ఆపేరుతో మూవీ తెరకెక్కిస్తానని తెలిపారు. రెండేళ్ల క్రితం వచ్చిన టైలర్ సంచలనం సృష్టించింది. ఈ సినిమా థియేటర్లోకి వస్తుందని వర్మ అభిమానులు ఇప్పటికీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share.