లక్ష్మీస్ ఎన్టీఆర్ లో బాబు విలన్.. బాలయ్య కమెడియన్

వర్మ ఒక హిట్ సినిమా తీసి చాలా ఏళ్లవుతోంది. ఆయన్నుంచి హిట్ సినిమా ప్రేక్షకులు కూడా ఎక్స్ పెక్ట్ చేయడం మానేశారనుకోండి. కానీ.. ఆయన ఏ సినిమా తీసినా, ఆ సినిమా గురించి రకరకాల చర్చలు, రచ్చలు జరగడం మాత్రం సర్వసాధారణం అయిపోయింది. ఆ విధంగా సినిమాలో కంటెంట్ ఏముంది అనే విషయం పక్కన పెడితే.. కేవలం టైటిల్ తోనే రచ్చ చేసిన సినిమా “లక్ష్మీస్ ఎన్టీఆర్”. ఈ సినిమా నిన్న ఆంధ్రాలో తప్ప అన్నీ చోట్ల విడుదలైంది. అన్నీ వర్మ సినిమాల్లాగే ఈ సినిమా కూడా రెగ్యులర్ మూవీ లవర్స్ ని కనీస స్థాయిలో ఆకట్టుకోనప్పటికీ.. చంద్రబాబునాయుడు హేటర్స్ బ్యాచ్ ను మాత్రం తెగ ఎంటర్ టైన్ చేస్తుంది.

ముఖ్యంగా.. సినిమాలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ చేత బాలకృష్ణ పాత్ర పోషింపజేసి.. ఆ క్యారెక్టర్ కి బాలయ్య మిమిక్రీ వాయిస్ తో డబ్బింగ్ చెప్పించిన వర్మ ఆ క్యారెక్టర్ ను పూర్తిస్థాయి కామెడీ రోల్ గా రాశాడు. దాంతో జనాలు చంద్రబాబును విలన్ లా చూడడం మొదలెడితే.. బాలయ్యను కమెడియన్ గా చూస్తున్నారు. మరి ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వం వహించే అవకాశం తనకివ్వలేదనే కోపంతో వర్మ అలా చేశాడా లేక కావాలనే బాలయ్యను కెలకాలని అలా చేశాడా అనేది తెలియదు కానీ.. ప్రస్తుతానికి జనాలు మాత్రం బాలయ్య పాత్రను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Share.