చంద్రబాబే టార్గెట్ గా… ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్..!

అభిమానులు కోసం నందమూరి బాలకృష్ణ – క్రిష్ లు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రూపొందిస్తున్నప్పుడే… ప్రేక్షకుల కోసం అసలు నిజాలు నేను చూపిస్తానంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ని అనౌన్స్ చేసాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసాడు వర్మ. ఈ ట్రైలర్ మొత్తం ‘వెన్నుపోటు’ నేపథ్యంలో సాగే ఎపిసోడ్ నే చూపించాడు వర్మ. ఆంధ్రప్రదేశ్ సీ.ఎం చంద్రబాబు నాయుడు నే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ట్రైలర్ ను వదిలినట్టు స్పష్టమవుతుంది. అగస్త్య మంజు అండ్ రాంగోపాల్ వర్మ కలిసి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు. ”రామ రామ రామ” అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ట్రైలర్ మొదలైంది.

lakshmis-ntr-movie-trailer-review1

lakshmis-ntr-movie-trailer-review2

లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ని కలవడానికి రావడం.. ‘జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుందో.. ఎవరికీ అర్ధం కాదు..’ అంటూ ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతితో చెప్పే డైలాగ్ తో సాగుతూ.. ‘ఈవిడ పేరు లక్ష్మీ పార్వతి మా జీవిత చరిత్ర రాస్తున్నారు..’ అంటూ లక్ష్మీపార్వతిని తన పార్టీ సభ్యులకు పరిచయం చేసే సన్నివేశాలను చూపించారు. ‘దానికిగాని కొడుకు పుడితే మీ ఫ్యామిలీ ఫినిష్’ అంటూ చంద్రబాబు.. ఎన్టీఆర్ ఫ్యామిలీతో అనడం.. వెంటనే ఆ ఇంటి ఆడపిల్ల లక్ష్మీపార్వతిని కొడుతూ బూతులు తిట్టడం చూపించారు. ‘ఈ వయసులో కూడా మీకు ఆడతోడు అవసరమంటే..’ అంటూ హరికృష్ణ.. ఎన్టీఆర్ ని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే దానికి ఎన్టీఆర్ సీరియస్ అవ్వడం చూపించారు. ‘తమ్ముళ్లూ వాడి మాట వినకండి..’ అంటూ ఎన్టీఆర్.. చంద్రబాబుని ఉద్దేశిస్తూ పార్టీ సభ్యులకు చెబితే వారు మాత్రం ఎన్టీఆర్ పై చెప్పులు విసరడం వంటి సన్నివేశాలు ఈ చిత్రం పై ఆసక్తిని పెంచుతాయి అనడంలో సందేహం లేదు.ఇక చివరగా ఎన్టీఆర్.. ‘నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు.. వాడిని నేను నమ్మడం” అంటూ చంద్రబాబుని ఉద్దేశించి చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలిచింది. మొత్తం మీద ఈ ట్రైలర్ చూస్తుంటే వివాదాలు తలెత్తడం ఖాయమనిపిస్తుంది. అందులోనూ త్వరలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనిస్తారా..? అనేది ఒక సందేహమైతే… ఒకవేళ ఈ చిత్రం విడుదలైతే దీని ‘ఎఫెక్ట్’.. చంద్రబాబు మరియు టీ.డీ.పీ పార్టీల పై ఎంతపడుతుంది అనేది మరో సందేహం. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Share.