తెరపైన జంట.. నిజజీవితంలో నూరేళ్ల పంట

వృత్తిధర్మంగా నటీనటులు సినిమాల్లో ప్రేమికులుగా, భార్య భర్తలుగా నటిస్తుంటారు. తెరపైన నిజమైనా ఆలూమగలుగా ప్రేక్షకుణ్ణి మెప్పించిన తారలు పేకప్ చెప్పేయగానే పలకరింపులు కూడా ఉండవు. కొందరు మాత్రం రీల్ లైఫ్ ని.. రియల్ లైఫ్ గా మార్చుకోవాలని కలలు కంటారు. కలకాలం జీవిత భాగస్వాములుగా ఉండాలనే స్వప్నాన్ని సాకారం చేసుకున్న హీరో, హీరోయిన్లపై ఫోకస్

కృష్ణ, విజయ నిర్మల Krishna, Vijaya Niramalaసూపర్ స్టార్ కృష్ణ , విజయ నిర్మల తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్ కాంబినేషన్. వీరిద్దరూ తొలిసారిగా బాపు దర్శకత్వం వహించిన ” సాక్షి” సినిమా షూటింగ్లో కలిసారు. ఆ సినిమా క్లైమాక్స్ లో కృష్ణ , విజయనిర్మల పెళ్లి చేసుకుంటారు. నిజజీవితంలో వారిద్దరూ భార్యాభర్తలయ్యారు. ఇద్దరికీ పెళ్లి అయి. పిల్లలున్నప్పటికీ వీరి ప్రేమకు అడ్డుకాలేదు. తిరుపతిలో కృష్ణ , విజయ నిర్మల పెళ్లి చేసుకొని సంతోషంగా జీవిస్తున్నారు.

నాగార్జున, అమల Nagarjuna, Amalaఅక్కినేని నాగార్జున, అమలను కలిపినా చిత్రం శివ. ఆ సినిమా నాగ్ కెరీర్ ని మలుపు తిప్పడమే కాదు, రియల్ లైఫ్ లోను గొప్ప కానుకను ఇచ్చింది. అందులో ప్రేమికురాలిగా నటించిన అమలను జీవిత భాగస్వామిగా నాగార్జున ఆహ్వానించారు. అప్పటికే నాగ్ కి పెళ్లి అయి నాగ చైతన్య పుట్టి ఉన్నాడు. అయినా ఆమెకు విడాకులు ఇచ్చి 1992 లో అమలను వివాహమాడారు.

పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్Pawan Kalyan, Renu Desaiబద్రి సినిమాలో పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ ల కెమిస్ట్రీ సూపర్ గా పండింది. అప్పుడే వీరిమధ్య ప్రేమ పుట్టి సహజీవనానికి దారి తీసింది . పవన్ తొలి భార్య నందిని తో విడాకులు మంజూరు అయ్యాక.. రాజకీయ ఒత్తిడి కారణంగా ఆలస్యంగా పెళ్లిచేసుకున్నారు. ఇప్పుడు ఆమెకు కూడా విడాకులు ఇచ్చి మరో విదేశీ నటికీ తాళి కట్టి అర్ధాంగిని చేసుకున్నారు.

శ్రీకాంత్, ఊహాSrikanth, Oohaశ్రీకాంత్, ఉహలు ఆమె సినిమాలో కలిసి నటించారు. అప్పుడే వీరి పరిచయం ఏర్పడింది. తరవాత ఒకరినొకరు అర్ధం చేసుకొని 2003 లో వివాహం చేసుకున్నారు. అన్యోన్యంగా జీవిస్తున్నారు.

జీవిత, రాజశేఖర్Jeevitha, Raja Sekharరాజశేఖర్, జీవిత కలిసి నటించిన మొదటి సినిమా ‘తలంబ్రాలు’. ఈ మూవీలో జీవితను ప్రేమించి మోసం చేసిన రాజశేఖర్ … నిజజీవితం లో మాత్రం ప్రేమించి పెళ్లిచేసుకుని చక్కగా చూసుకుంటున్నారు.

కమల హాసన్, గౌతమి Kamal Hassan, Gautamiకమల్ హాసన్ మొదట 1978 లో డాన్సర్ వాణి గనపతి పెళ్లి చేసుకొని 7 సంవత్సరాలు కాపురం చేశారు. తర్వాత నటి సారికను వివాహమాడారు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చి నటి గౌతమిని తన జీవితంలోకి ఆహ్వానించారు. వీరిద్దరూ ద్రోహి సినిమాలో భార్య భర్తలుగా నటించారు.

మహేష్ బాబు, నమ్రత Mahesh Babu, Namrataమహారాష్ట్రీయుల కుటుంబంలో జన్మించిన నమ్రతకు తెలుగులో వంశీ సినిమా చేస్తున్నప్పుడు మహేష్ బాబు తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిరుచులు ఒకటి కావడంతో ప్రేమించుకున్నారు. నమ్రత కుటుంసభ్యుల సమక్షంలో ముంబై లో ఫిబ్రవరి 10 , 2005 న పెళ్లి చేసుకున్నారు.

జ్యోతిక, సూర్య Jyothika, Suriyaతెలుగువారికి సూర్య, జ్యోతికలు బాగా పరిచయం. వీరిద్దరూ కలిసి నటించిన తమిళ చిత్రాలు విజయం సాధించాయి. వాటిల్లో ప్రేమికులుగా ప్రేక్షకులుగా మెప్పించిన ఈ జంట, పెళ్లి చేసుకొని సంతోషంగా జీవిస్తున్నారు.

నాగచైతన్య, సమంతNaga Chaitanya, Samanthaవెండితెరపై భార్య భర్తలుగా నటించిన నాగచైతన్య, సమంత .. నిజజీవితం లోను ఆలుమగలు కాబోతున్నారు. మూడు సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ ప్రేమించుకొని పెద్దల్ని ఒప్పించి నిశ్చితార్ధం చేసుకున్నారు. త్వరలో పెళ్లి పీటలపై కూర్చోనున్నారు.

Share.