హీరోయిజాన్ని సరికొత్తగా ఆవిష్కరించిన అల్లు అర్జున్

‘వీడు హీరో ఏంట్రా..’ అనే విమర్శ నుంచి .. ‘హీరో అంటే వీడురా’ అనే ప్రశంస అందుకునేలా తనను తాను మార్చుకున్న నటుడు అల్లు అర్జున్. హీరో అంటే ఇలానే ఉండాలి.. అనే మార్క్ ని చెరిపేసి.. హీరో అంటే ఇలా కూడా ఉండవచ్చు అని నిరూపించాడు. హీరోయిజానికి కొత్త అర్ధం చెప్పిన స్టైలిష్ స్టార్ నేడు (ఏప్రిల్ 8 న పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు ఫిల్మీ ఫోకస్ శుభాకాంక్షలు తెలియ జేస్తూ.. బన్నీ హీరోయిజం పై ఫోకస్..

ఆర్యAryaహీరో ప్రేమిస్తే హీరోయిన్ ప్రేమించాలి.. లేదంటే హీరో విలువ తగ్గిపోతుంది. ఆ మాటకి ఆర్యతో చెక్ చెప్పారు అల్లు అర్జున్. వన్ సైడ్ లవర్ గా నటించి కొత్త రకం ప్రేమ కథలకు పునాది వేశారు.

దేశముదురు Desamuduruకథానాయకుడు అనే వాడు బతకాలి.. నలుగురిని బతికించాలి.. అందుకోసం విలన్లను చంపాలి. కానీ అల్లు అర్జున్ దేశముదురు సినిమాలో “చస్తే ఏ గోలా లేదు.. చస్తే ఏ గొడవా లేదు.. పుట్టే ప్రతివాడు చస్తాడోయ్” అంటూ వేదాంతం పాడుతూ క్లాస్, మాస్ అందరికీ దగ్గరైపోయారు.

వేదం Vedamస్టార్ హీరో హోదా వచ్చేసిన సమయంలో అల్లు అర్జున్ వేదం లో కేబుల్ రాజు క్యారక్టర్ చేయడానికి ఒకే చెప్పారు. అద్భుతంగా నటించి హీరో అంటే ఎక్కడో నుంచి రారు.. మనలోనే హీరో ఉంటాడు అని ఈ చిత్రం ద్వారా బన్నీ చెప్పారు.

బద్రీనాథ్ Badrinathఅందరినీ ఆ దేవుడు రక్షిస్తాడు.. అటువంటి దైవానికి రక్షణగా ఉండాలంటే.. శక్తి తో పాటు నిగ్రహం ఉండాలి. అంత బలశాలిగా బాడీని పెంచి.. నిష్టతో ఉండే యువకుడిగా బద్రీనాథ్ లో నటించారు. ద్వారా పాలకుడికి బన్నీ హీరోయిజాన్ని అందించారు.

జులాయి Julayiఅల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయిని జులాయి అని తేలికగా తీసుకోవద్దు.. అతను కూడా ఎదిగేందుకు ఏదో విధంగా కష్టపడుతుంటాడు.. అని జులాయి సినిమాలో అల్లు అర్జున్ తన పాత్ర ద్వారా చెప్పారు. జులాయి లోని హీరోని చూపించి హిట్ అందుకున్నాడు.

రేస్ గుర్రంRace Gurramయువకులు సాధారణంగా ఉండకూడదు.. రేసు గుర్రంలా దూసుకు పోవాలని రేసుగుర్రం మూవీలో అల్లు అర్జున్ పవర్ ఫుల్ యాక్షన్ తో ఉత్సాహం ఇచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాలో బన్నీ రోల్ అందరికీ తెగనచ్చింది. అటువంటి రోల్స్ కి ప్రాణం పోయడంలో స్టైలిష్ స్టార్ దిట్ట.

సన్నాఫ్ సత్యమూర్తి Son Of Satyamurtyప్రతి కొడుక్కి తండ్రి హీరోనే. అలాగే ప్రతి తండ్రికి కొడుకు హీరోనే. మరి ఆవిషయాన్ని లోకం ఒప్పుకోవాలంటే మాత్రం .. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. తండ్రి పాటించిన విలువలను కొడుకు కొనసాగిస్తే అతన్ని అందరూ అభినందించకమానరు. సో అటువంటి డ్రై పాత్రకు తన నటన, స్టైల్ జోడించి హీరోయిజాన్ని అల్లు అర్జున్ తీసుకొచ్చారు.

సరైనోడు Sarrainoduస్టైల్ గా ఉంటే క్లాస్ కథలనే చేయాలి. రఫ్ గా ఉంటే మాస్ స్టోరీలనే ఎంచుకోవాలనే రూల్ ని సరైనోడు చిత్రంతో స్టైలిష్ స్టార్ బద్దలు కొట్టాడు. “ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడనుకుంటున్నావేమో, మాస్.. ఊర మాస్” అంటూ ఏ సెంటర్.. బి సెంటర్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్లలో కలెక్షన్లతో ఉతికి ఆరేశాడు.

దువ్వాడ జగన్నాథం Duvvada Jagannadamహరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం దువ్వాడ జగన్నాథం. బ్రాహ్మణ యువకుడు కేవలం మంత్రాలూ మాత్రమే చదుతాడనుకుంటే పొరబాటు.. అవసరమైతే అక్రమార్కుల నోటి నుంచి రక్తం కక్కిస్తాడని ఇందులో నిరూపించబోతున్నారు.

Share.