‘ఎన్టీఆర్ కథానాయకుడు’ లో ఆకర్షించే అంశాలు..!

గత కొంత కాలంగా బయోపిక్ ల ట్రెండ్ జోరందుకుంది. 2018 లో వచ్చిన ‘మహానటి’ చిత్రం ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. మహానటి సావిత్రి గారి జీవితాధారంగా తెరెక్కిన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేయడంతో పాటు.. సావిత్రి గారి గురించి తెలియని ఎన్నో విషయాల్ని, ఆమె గొప్పతనాన్ని ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించారు. ఇక ఈ బయోపిక్ తరువాత అంతకు రెట్టింపు ఉత్సాహంతో ‘ఎన్టీఆర్ బయోపిక్’ ను తెరకెక్కించారు. మహానటుడు, దివంగత నేత ‘నందమూరి తారక రామారావు’ జీవిత కథాంశంతో రెండు పార్టులుగా ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు. అందులో మొదటి పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కాగా మరొకటి ‘ఎన్టీఆర్ మహానాయకుడు’. ఇక ఇటవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 9 న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల కాబోతుంది. ‘ఎన్టీఆర్’ పై ఉన్న గౌరవంతో యావత్ తెలుగు ప్రేక్షకుల ఈ చిత్రంకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విశ్వవిఖ్యాత.. నట సార్వభౌమ.. నందమూరి తారక రామారావు గారి పేరు వినని వారుండరు అనడంలో సందేహం లేదు. అలాంటి ఆ మహానుభావుడి జీవితం గురించి చెప్పే అవకాశం అయన కుమారుడైన నందమూరి బాలకృష్ణను వరించగా.. దానిని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు క్రిష్ జాగర్లమూడి. ఇక ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ నుండీ ‘ఎన్టీఆర్’ సినీ చరిత్రను గురించి చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నాం.

సబ్ రిజిస్ట్రర్ నుండీ గొప్ప తెలుగు నటుడిగా :

1-sub-registrar-to-biggest-telugu-actor

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అనే ఊరిలో సబ్ రిజిస్ట్రర్ గా పని చేస్తున్న ఒక వ్యక్తి ఆఫీస్ లో జాయినయిన 3 వారాల్లోనే ఉద్యోగం వదిలేసి… సినిమాల్లో నటించాలని ఎందుకు నిర్ణయించుకున్నారనేది మనం తెలుసుకోవాలి.

అందుకు అతని భార్య సహకారం :

2-wife-support

ఎన్టీఆర్ సతీమణి అయిన బసవతారకం గురించి చాలా విషయాలు మనకి తెలియదు. ఇక ఎన్టీఆర్ జీవితంలో ఆవిడ చాలా ముఖ్య పాత్ర పోషించింది. ఇకబసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించబోతుంది.

ఎన్టీఆర్ – ఏ.ఎన్.ఆర్ మధ్య స్నేహం ఎలా కుదిరింది?

3-biggest-support-anr

ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ లు మన తెలుగు చలన చిత్ర సీమకి పెద్ద దిక్కు వంటి వారు, అప్పట్లో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు ఉన్నాయి, అలాగే వీరిద్దరి సినిమాలకు కూడాగట్టి పోటీ ఉండేది. కానీ తెరవెనుక వారిమధ్య మంచి స్నేహ బంధం ఉందని.. అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ స్నేహ బంధం గురించి ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

చెన్నై నుండీ హైదరాబాద్ కు ఎలా మారారు..?

hyd-to-chennal

అప్పట్లో దక్షణాది సినిమా పరిశ్రమ అంతా మద్రాసీయులు అని అందరు అనుకునేవారు. మన తెలుగు వాళ్ళు అంటూ ప్రత్యేక గుర్తింపు ఉండేది కాదు. మన తెలుగు చిత్ర పరిశ్రమకు కనీస గుర్తింపు ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మనకంటూ ఒక ప్రత్యేక ఇండస్ట్రీ ఉండాలని ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారు. అది కూడా ఈ చిత్రం ద్వారా తెలుసుకోవచ్చు.

ఇలా ఎన్టీఆర్ గారి వ్యక్తిగత జీవితం,సినిమా జీవితం.. అలాగే అయన ఎదుర్కొన్న పరిస్థితులు అన్ని ఈ చిత్రం ద్వారా మనకు చూపించబోతున్నారు. అయన జీవితం గురించి చెప్పాలి అనే ఒక ప్రయత్నంలో ఎంతో మంది కష్టం ఉంది. వాళ్ళలో కొందరి గురించి చూద్దాం.

నందమూరి బాలకృష్ణ :

4-bala-krishna

తన జీవితంలో చాలా ప్రతిష్టాత్మకంగా భావించిన చిత్రమిది. బడ్జెట్ కి వెనుకాడకుండా, కలెక్షన్ల గురించి ఆశించకుండా.. తన తండ్రి గురించి అందరూ తెలుసుకోవాలనే తపనతో ఈ చిత్రంలో నటించడంతో పాటు.. నిర్మించారు.

రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్ జాగర్లమూడి )

5-krish

డైరెక్టర్ క్రిష్ ఇప్పటివరకూ చాలా సక్సెస్ఫుల్ చిత్రాలని తెరకెక్కించారు. ఒక చిత్రంలో మంచి హ్యూమన్ ఎమోషన్స్ ఉండే సన్నివేశాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. ఇతని చిత్రాలకి వంకలు పెట్టేవారుండరు. ఇలాంటి ఒక డైరెక్టర్ బయోపిక్ తీస్తున్నాడంటే.. అతని దర్శకత్వ ప్రతిభ ఏ స్థాయిలో ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది నిజ జీవిత వ్యక్తుల్ని.. సినిమాలో కూడా అచ్చం అలాగే ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పోస్టర్స్ మరియు ట్రైలర్ చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతుంది.

ఎం.ఎం.కీరవాణి :

6-mm-keeravani

దాదాపు 30 సంవత్సరాల నుండీ ఇండస్ట్రీలో ఉన్న వారిలో కీరవాణి గారు ఒకరు. ఇప్పటి వరకూ చాలా విభిన్నమైన జోనర్లకు సంబంధించిన ఎన్నో చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చారు. అలంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక బయోపిక్ కి మ్యూజిక్ ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇక ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతమిచ్చారని.. అలాగే నేపధ్య సంగీతంతో కూడా అలరిస్తారని.. పాటలు మరియు ట్రైలర్లు చూస్తే స్పష్టమవుతుంది. క్రిష్ గతంలో చేసిన వేదం చిత్రానికి కూడా అద్భుతమైన సంగీతమిచ్చారు కీరవాణి.

బుర్రా సాయి మాధవ్ :

7-sai-madhav-burra
‘కృష్ణం వందే జగద్గురుమ్’ ‘కంచె’ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ‘మహానటి’ వంటి చిత్రాలకు అద్భుతమైన డైలాగులు అందించిన సాయి మాధవ్ గారు ఈ చిత్రానికి కూడా అద్భుతమైన డైలాగులు రాసారు. అంతే కాదు ఈ చిత్రంలో ఒక గెస్ట్ రోల్ లో కూడా కనిపించబోతున్నారు. అయన రాసే డైలాగ్స్ సాఫ్ట్ గా ఉన్నా.. హార్డ్ గా తగుల్తాయి అనడంలో సందేహం లేదు. ఇక ఈ చిత్రంలో ఈయన డైలాగులు ఏ రేంజ్లో ఉండబోతున్నాయో.. ప్రోమోలు చెప్తున్నాయి.

ఆకర్షించే పెద్ద తారాగణం :

8-biggest-star-cast
నందమూరి బాలకృష్ణ ,విద్యాబాలన్ , సుమంత్ , రానా దగ్గుబాటి, కళ్యాణ్ రామ్,ప్రకాష్ రాజ్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్, కైకాల సత్యనారాయణ, పాయల్ రాజ్ పుత్, నరేష్, మురళి శర్మ, హన్సిక… ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఇంతమంది తారాగణాన్ని ఒక స్క్రీన్ పైన చూడాలి అంటే మనం కచ్చితంగా ఈ సినిమాని చూడాల్సిందే. ఇలా మన తెలుగు చలన చిత్ర పరిశ్రమని ఒక స్థాయికి తెచ్చిన మహానుభావుడు ‘ఎన్టీఆర్’ గురించి చెప్పాలి అనే బలమైన కోరికతో తీసిన ఈ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా వెనుక.. ఇంకా ఎంతోమంది కష్టం ఉంది. వాళ్ళందరి కోసం మనం ఈ సినిమా తప్పకుండా చూడాలి మరి..!

Share.