డ్రగ్స్ కేస్ పై స్పందించిన రవితేజ తల్లి!

డ్రగ్స్ కేసులో సినీ స్టార్లకు సంబంధం ఉందని వార్తలు వెలువడినప్పటి నుంచీ తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేగింది. కొంతమంది తమకు నోటీసులు అందాయని ఒప్పుకుంటుంటే మరికొంతమంది ఖండిస్తున్నారు. తాజాగా రవితేజ తల్లి రాజ్య లక్ష్మి దీనిపై స్పందించారు. డ్రగ్స్ కేసులో రవితేజ పేరు రావడం బాధాకరమన్నారు. రవికి కనీసం సిగరెట్ తాగే అలవాటు కూడా లేదని.. ఆ విధంగా ఎవరినీ ప్రోత్సహించడని చెప్పారు. అలాంటి వాడిని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రవితేజ ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదన్నారు.

రవి తేజ డ్రైవర్ శ్రీనివాసరావు పేరు కూడా డ్రగ్స్ కేసులో ఉందని ప్రశ్నించగా.. అది అవాస్తవమని, అలాంటి అలవాటు ఉండేవారిని రవితేజ పక్కన కూడా పెట్టుకోడని వివరించారు. ఇక తమ్ముడు భరత్ మరణం, అంత్యక్రియలకు వెళ్ళకపోవడం అనే విషయాలపై స్పందిస్తూ..  తనని ఓదార్చడానికి ఇంటిలోనే ఉండిపోయాడని చెప్పారు. తమ్ముడి పోయిన దుఃఖంలో ఉన్నా.. నిర్మాతలు నష్టపోకూడదన్న కారణంతోనే రవితేజ షూటింగులకు హాజరయ్యాడని తెలిపారు. ఒంటరిగా కష్టపడుతున్న రవితేజపై నిందలు వేయడం మంచి కాదని రాజ్య లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.