ఎన్టీఆర్ ని రవితేజ మించుతారా?

మహానటుడు ఎన్టీఆర్, విశ్వనటుడు కమలహాసన్.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి త్రి పాత్రాభినయం పోషించి ప్రేక్షకులతో జేజేలు అందుకున్నారు. తాజాగా ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో నటవిశ్వరూపం చూపించారు. మూడు పాత్రల్లో మెప్పించారు. ఎన్టీఆర్ కి పోటీగా మాస్ మహారాజ్ రవితేజ మూడు క్యారక్టర్ లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం రవితేజ  “రాజా ది గ్రేట్” సినిమా చేస్తున్నారు. అనిల్ రావి పూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెలలో రిలీజ్ కానుంది. దీని తర్వాత విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ”టచ్ చేసి చూడు” సినిమాను పూర్తి చేయనున్నారు.

ఈ రెండు సినిమాల తర్వాత శ్రీనువైట్లతో మూవీ మొదలుకానుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమాకి ”అమర్ అక్బర్ అంథోని” అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు తెలిసింది.  ఇందులో హీరోయిన్ గా త్రిషా, అనుష్కలు  ఫిక్స్ అయ్యారు. మరో హీరోయిన్ కోసం చూస్తున్నారు. ఈ చిత్రం గురించి అధికారికంగా త్వరలో ప్రకటిస్తారు. మరి రవితేజ మూడు పాత్రల్లో తన నటనతో ఎన్టీఆర్ కి షాక్ ఇస్తారో, లేదో చూడాలి.

Share.