అమర్ అక్బర్ ఆంటోనీలో రవితేజ కొడుక్కి నో ఎంట్రీ

రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో “అమర్ అక్బర్ ఆంటోనీ” మొదలైనప్పుడు అందర్నీ అమితంగా ఆకట్టుకొన్న విషయం ఆ సినిమాలో రవితేజ తనయుడు మహాధన్, లయ కుమార్తె శ్లోక ప్రధాన పాత్రలు పోషిస్తుండడం. అయితే.. ప్రొజెక్ట్ ప్రారంభం అయినప్పటికీ పట్టాలెక్కడంలో కాస్త లేట్ అవ్వడంతో ముందుగా హీరోయిన్ అను ఎమ్మాన్యుల్ ను సినిమా నుంచి తప్పించిన చిత్రబృందం ఆమె స్థానంలో ఇలియానాను ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మారిన షెడ్యూల్స్ కారణంగా సినిమాలో మరో భారీ మార్పు చోటు చేసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి రవితేజ తనయుడు మహాధన్ తో శ్రీనువైట్ల కీలకపాత్ర పోషింపజేయాలనుకొన్నాడు.

ఆ మేరకు మంచి క్యారెక్టర్, సీన్స్ రాసుకొన్నాడు కూడా. కానీ.. మారిన షెడ్యూల్స్ తో అనుకొన్న టైమ్ కి సినిమా సెట్స్ కు రాలేకపోయింది. ఇప్పుడు గనుక షూటింగ్ మొదలైతే.. మహాధన్ నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ లో పాల్గొనాల్సి వస్తుంది. అయితే.. వచ్చే నెల నుంచి మహాధన్ కు స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్కూల్ మాన్పించి మరీ యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేకపోవడంతో రవితేజ ఈ సినిమా నుంచి మహాధన్ ను తప్పించాడట. ఇప్పుడప్పుడే మహాధన్ ను సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చాడు రవితేజ.

Share.