అవెంజర్స్ లో తానోస్ లాంటి క్యారెక్టర్ చేయాలి : రాణా

భారతీయ వెండితెరపై సూపర్‌హీరో పాత్రలను పోషించాలని ఉందని చెప్పారు రానా. హాలీవుడ్‌లో హల్క్‌, థానోస్‌ లాంటి సూపర్‌ హీరో క్యారెక్టర్‌లు ఇక్కడా అవకాశం వస్తే నటిస్తానని అన్నారు. ఆరడగుల రానా సాధారణ హీరో కథలకు దూరంగా ప్రత్యేకమైన చిత్రాలను ఎంచుకుంటూ తన నట ప్రస్థానం సాగిస్తున్నారు. ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి, బాహుబలి రెండు భాగాల సినిమాలు ఈ నటుడిలోని ప్రతిభను చూపించాయి. బేబీ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమను ఆకట్టుకున్నారు రానా.

ప్రస్తుతం బాలీవుడ్‌లో హాతీ మేరా సాథీ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల రానా మాట్లాడుతూ…సూపర్‌ హీరో చిత్రాలు ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందిస్తాయి. అలాంటి చిత్రాన్ని చూస్తున్నప్పుడు కొద్ది సేపటికే వాళ్ల లోకంలోకి వెళ్లిపోతాం. భారతీయ తెరపై హల్క్‌, తానోస్‌ లాంటి సూపర్‌ హీరో చిత్రాలు చేయాలని ఉంది. స్టార్‌ వార్స్‌ అమెరికన్‌ థియేటర్‌లలో ఎలాంటి సంచలనం సృష్టించిందో మన దగ్గర బాహుబలి అంతటి ఘన విజయం అందుకుంది అంటున్నాడు రాణా.

Share.