శివగామి పాత్రకు భారీ పారితోషికం అందుకున్న రమ్యకృష్ణ

బాహుబలిలో హీరో హీరోయిన్లతో సమానంగా పేరుతెచ్చుకున్న పాత్ర రాజమాత శివగామి. ఈ క్యారక్టర్ కి రామాయాకృష్ణ తన నటనతో జీవం పోశారు. స్థిరస్థాయిగా నిలిచిపోయేలా నటించారు. “ముందుగా శివగామి పాత్రకు  వేరే నటిని  అడిగాము. వారు రెమ్యునరేషన్ ఎక్కువగా అడిగేసరికి వెనక్కి వచ్చి రమ్యకృష్ణను తీసుకున్నాం. ఇంతమంచి ఆర్టిస్టుని పెట్టుకొని వేరే వారిని సంప్రదించినందుకు  ఆమెకు క్షమాపణలు” అంటూ దర్శకుడు రాజమౌళి అందరి ముందూ క్షమాపణలు చెప్పారు. అంతలా నటనతో మెప్పించింది.

బాహుబలి బిగినింగ్ లోనే కాదు.. ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న బహుబలి కంక్లూజన్ లోను శివగామి పాత్ర కీలకం కానుంది. ఇక బాహుబలి విజమలో కీలక పాత్ర పోషించి రమ్యకృష్ణకు ముందు చెప్పిన మొత్తం కంటే ఎక్కువగా నిర్మాతలు ఇచ్చినట్లు తెలిసింది. రెండు పార్టులకు కలిపి కోటీ రూపాయలకు పైగా ఆమె అందుకున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.