రంభ ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచాడు

90వ దశకంలో తన అందచందాలు, మాస్ డ్యాన్స్ నెంబర్స్ తో వయోబేధం లేకుండా అందర్నీ అమితంగా అలరించిన అందాల తార రంభ. కేవలం ఆమె వల్లనే సినిమాలు ఆడిన రోజులు కూడా ఉన్నాయ్. అలాంటి రంభ పెళ్ళికి ముందు కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి అనంతరం స్పెషల్ సాంగ్స్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది.

అనంతరం ఒక బిజినెస్ మ్యాన్ ను పెళ్లాడి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి సినిమాలకు తాత్కాలికంగా స్వస్తిపలికింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రీరీఎంట్రీ ఇద్దామని ప్రయత్నించిన రంభకు అనుకోని విధంగా చుక్కెదురైంది. ఎన్టీయార్-త్రివిక్రమ్ సినిమాతో మళ్ళీ రీరీఎంట్రీ ఇద్దామనుకున్న రంభ ఊహించనివిధంగా ముచ్చటగా మూడోసారి గర్భవతి అవ్వడంతో సినిమాల్లోకి మళ్ళీ రావాలనే ఆలోచనను పక్కన పెట్టేసింది. ప్రస్తుతం తన మూడో బిడ్డ కోసం ఎదురుచూస్తూ సంతోషంగా గడిపేస్తుంది. సో, కుదిరితే మూడో బిడ్డ జననం అనంతరం సినిమాల్లోకి మళ్ళీ రావచ్చేమో.

Share.