పవన్ ఫ్యాన్స్ గొడవ…అమ్మ సెంటిమెంటుతో చెర్రీ భలే కంట్రోల్ చేశాడే!

కొందరు యాక్టింగ్ లో తమ టాలెంట్ చూపిస్తారు….మరి కొందరు డ్యాన్స్ లో…ఇంకొందరు మాటల్లో…ఏది ఏమైనా…ఏదో ఒక టాలెంట్ ఉంటేనే వారు హీరోలు అవుతారు…అన్నది మాత్రం నిజం….అసలు మ్యాటర్ ఏంటి అంటే ఈ మధ్య మన మెగా హీరోలకు అస్సలు కలసి రావడం లేదు…సినిమాల పరంగా మంచి హిట్స్ కొడుతున్నా…అనుకోకుండా ఫ్యాన్స్ కోసం మాట్లాడే క్రమంలో విమర్శల పాలవుతున్నారు. దానికి ఉదాహరణంగా మన బన్నీ…’చెప్పను బ్రదర్’ వ్యవహారమే తీసుకోవచ్చు…ఇదిలా ఉంటే ఈ విషయంలో మెగా పవర్ స్టార్ మాత్రం రిస్క్ తీసుకునే ప్రయత్నం ఎపుడూ చెయ్యలేదు…అంటే కాదు…తన వ్యవహార శైలితో పాటు…తన స్పీచ్ లో కూడా చాలా మార్పును చూపించి అందరినీ ఆకట్టుకుకుంటున్నాడు…అసలు విషయంలోకి  వెళితే…దర్శకుడు ఆడియో రిలీజ్ కు వచ్చిన చరణ్ ఆ సినిమా విశేషాలను మాట్లాడుతూ తన ఫ్యామిలీ గురించి కూడా అందరు ఇంప్రెస్ అయ్యేలా మాట్లాడాడు.

తను మాట్లాడుతున్నప్పుడే పవర్ స్టార్ పవర్ స్టార్ అని కేకలేస్తుంటే బాబాయ్ అంటూ పలకడమే కాదు తన ఫ్యామిలీ గురించి తను మనసులో ఎక్కువ ఉంటుంది మాటల్లో తక్కువ ఉంటుందని ఫ్యాన్స్ ను మెప్పించేశాడు. ఓ పక్క అల్లు అర్జున్ ఏమో చిరు, పవన్ ప్రస్తావనే తేకుండా ఉంటుంటే.. చరణ్ మాత్రం మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ అని లేకుండా అందరిని కలుపుకుపోతున్నాడు. ఇది కచ్చితంగా చరణ్ కు కలిసివచ్చే అంశమే అని చెప్పొచ్చు. ఇక్కడ మెగా హీరోలతో పోలిస్తే చెర్రీ ఆలోచన కాస్త డిఫరెంట్ గా ఉంది అనే చెప్పాలి…ఎందుకంటే వివాదాస్పద వ్యాఖ్యలు అప్పుడు కిక్ ఇస్తాయేమో కాని ఫ్యాన్స్ ను తమకి దూరం చేసున్నాయన్న విషయం గమనించిన చెర్రీ తన మాటలతో అందరినీ మెప్పించాడు. ఇక ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన పెద్దలైతే చెర్రీని చూసి మిగిలిన హీరోలు చాలానే నేర్చుకోవాలి అని గుసగుసలాడుకుంటున్నారు. అదీ అసలు మ్యాటర్.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.