చరణ్, సుకుమార్ సినిమాలో యాక్షన్ మిస్ కాదు

ప్రయోగాలు చేసే సుకుమార్ ఈ సారి అందమైన ప్రేమకథను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. అందులో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సెలక్ట్ అయిన తర్వాత అభిమానులు మొదట్లో సంతోషించినప్పటికీ, కథ తెలిసి బాధపడ్డారు. ఇందులో కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది.. యాక్షన్ ఉండదని నిరూత్సాహపడ్డారు. ఈ విషయం తెలిసి చిత్ర బృందం కథలోని కీలక పాయింట్ ని బయట పెట్టింది. కథ పల్లెటూరి నేపథ్యంలో సాగినా, ఇది పక్కా కమర్షియల్ సినిమా అని, రివేంజ్ స్టోరీని సుకుమార్‌ తన శైలి కథనంతో తెరకెక్కిస్తున్నారని వెల్లడించింది.

రేపల్లె అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం కొల్లేరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకొంటోంది. రామ్‌చరణ్‌, సమంతలపై ఓ పాటను కూడా పూర్తిచేశారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కి విలన్ గా జగపతిబాబు అదరగొట్టనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.