ఆడపిల్లల సంరక్షణ కోసం పాటుపడనున్న రకుల్ ప్రీత్ సింగ్

భ్రూణ హత్య ల నిర్మూలనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన “భేటీ బచావో… భేటీ పడావో” పథకం ప్రజల్లోకి వెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తరపున బ్రాండ్ అంబాసిడర్ గా ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీతి సింగ్ ను ఎంపిక చేసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రకుల్ పలు సామజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటోంది. ముఖ్యంగా చిన్నారులకు పలు సందర్భాల్లో పాఠాలు చెప్పింది. రకుల్ పాపులారిటీ, సేవా తత్వం గమనించిన తెలంగాణ నేతలు, అధికారులు ఆమెకు ఈ బాధ్యతను అప్పగించింది.

బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావడంపై రకుల్ ఆనందం వ్యక్తం చేసింది. ఆడపిల్లల సంరక్షణ కోసం, అలాగే వారికి చదువులపై అవగాహన తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానని వెల్లడించింది. ప్రస్తుతం రకుల్ చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి తమిళం కాగా, మరొకటి హిందీ. తెలుగులో కొన్ని చిత్రాలకు త్వరలో సైన్ చేయనుంది. ఇంత బిజీగా ఉన్నప్పటికీ ఆడపిల్లల కోసం శ్రమిస్తానని రకుల్ స్పష్టం చేయడం అభినందనీయం.

Share.