రాజు గారి గది 2 థియేట్రికల్ ట్రైలర్ | నాగార్జున, సమంత, సీరత్ కపూర్

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా పివిపి సినిమా-మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ మరియు ఓ.ఎ.కె ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “రాజు గారి గది 2”. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత, సీరత్ కపూర్, నరేష్, అశ్విన్, వెన్నెల కిషోర్ లు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ను నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయగా.. ఆడియన్స్ అండ్ నాగార్జున ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. “బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ “రాజుగారి గది”కి సీక్వెల్ గా రూపొందిన “రాజుగారి గది 2″ ట్రైలర్ ను సెప్టెంబర్ 20న మా చిత్ర కథానాయకుడు నాగార్జున గారి తండ్రి అక్కినేని నాగేశ్వర్రావుగారి పుట్టినరోజును పురస్కరించుకొని విడుదల చేశారు. నాగార్జున ఈ చిత్రంలో మెంటలిస్ట్ గా కనిపించనుండగా.. అక్టోబర్ 13న సినిమా విడుదలకానుంది” అన్నారు.

Share.