‘కె.జి.ఎఫ్’ ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇటీవల విడుదలైన ‘కె.జి.ఎఫ్’ చిత్ర టీజర్,ట్రైలర్లకు మంచి లభించిన సంగతి తెలిసిందే. కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కె.జి.ఎఫ్’ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుండడం విశేషం. ‘కె.జి.ఎఫ్’ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల కానుంది.

ఈ చిత్రాన్ని తెలుగులో సాయి కొర్రపాటి రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 22 న హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ‘కె.జి.ఎఫ్’ ప్రీ రిలీజ్ వేడుకకు దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథి గా హాజరు కాబోతున్నాడు. రాజమౌళి, సాయి కొర్రపాటి మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. గతంలో సాయి కొర్రపాటి చిత్రాల వేడుకలకి కూడా రాజమౌళి హాజరయ్యాడు. రాజమౌళి అతిధిగా రానుండడంతో ‘కె.జి.ఎఫ్’ చిత్రానికి మరింత హైప్ ఏర్పడే అవకాశం ఉందని చెప్పడంలో సందేహం లేదు.

Share.