రాజా ది గ్రేట్ థియేట్రికల్ ట్రైలర్ | ర‌వితేజ‌, మెహ‌రీన్‌

హీరో క్యారెక్టరైజేషన్‌కు త‌న‌దైన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీతో వేరియేష‌న్ చూపించే క‌థానాయ‌కుడు మాస్ మ‌హారాజా రవితేజ‌. ఈయ‌న క‌థ‌నాయ‌కుడుగా ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `రాజా ది గ్రేట్‌`. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్‌పై శిరీష్ నిర్మాత‌గా ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతుంది. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని శ‌ర‌వేగంగా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. సాయికార్తీక్ సంగీత సారథ్యం వ‌హించిన సాంగ్స్ ఇటీవ‌ల విడుద‌లైంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “సినిమా అవుట్‌పుట్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా వ‌చ్చింది. మాస్ మాహారాజా ర‌వితేజ‌గారి ఎన‌ర్జీ గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందులో ఆయ‌న డబుల్ ఎన‌ర్జీతో క‌న‌ప‌డ‌తాడు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌న‌పించ‌ని స‌రికొత్త క్యారెక్ట‌ర్‌లో ర‌వితేజ క‌నిపించ‌బోతున్నారు. సాయికార్తీక్ మ్యూజిక్ సూప‌ర్బ్‌గా కుదిరింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా అంద‌రినీ అల‌రించ‌డం ఖాయం“ అన్నారు.

Share.