తన పెళ్లి విషయాన్ని విభిన్నంగా చెప్పిన రాహుల్

సైన్మా అనే షార్ట్ ఫిలిం ద్వారా తెలంగాణ ప్రజల మనసు గెలుచుకున్న రాహూల్ రామకృష్ణ “అర్జున్ రెడ్డి” సినిమాతో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలోనూ రాయలసీమ యువకుడిగా నటించి మంచి నటుడిగా అభినందనలు అందుకున్నారు. గీత గోవిందం చిత్రం తర్వాత మరింత బిజీ అయిపోయారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్న ఇతను త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఈ విషయాన్ని రాహూల్ విభిన్నంగా చెప్పారు.

బీచ్‌లో తనకు కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ… “జనవరి 15న నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవరికీ చెప్పకండి. సీరియస్లీ” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసి రాహూల్ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హీరోలు నిఖిల్ సిద్ధార్థ్, సుశాంత్‌, కమెడియన్ వెన్నెల కిశోర్‌, విద్యుల్లేఖ రామన్‌ లు కూడా విషెష్ చెప్పారు. ఆ అమ్మాయి ఎవరు ? ప్రేమ వివాహమా? పెద్దల కుదిర్చిన సంబంధమా? అనే విషయాలు బయటికి రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది.

Share.