చిరంజీవిని ప్రశంసలతో ముంచ్చెత్తిన దర్శకేంద్రుడు

బాస్ ఈజ్ బ్యాక్.. బాస్ ఎప్పటికీ బాసే.. చిరు రికార్డ్స్ కుమ్ముడు .. అంటూ మెగాస్టార్ చిరంజీవి సినిమా ఖైదీ నంబర్ 150 మూవీ చూసిన ఆనందంలో సినీ ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు. చిరు బ్లాక్ బస్టర్ తో రీ ఎంట్రీ ఇచ్చారని  అభిమానులు సంబరపడిపోతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన దువ్వాడ జగన్నాథం షూటింగ్ కి బ్రేక్ చెప్పి సతీమణి స్నేహారెడ్డితో కలిసి సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. వేదికలపై అతి పొదుపుగా మాట్లాడే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సోషల్ మీడియాలో చిరు గురించి స్వీట్ గా చెప్పారు.

‘సినిమా చేసి చాలా రోజులు అయింది’ అనే మాట కేవలం మాట వరసకు మాత్రమే. అదే జోరు..అదే ఊపు.. అదే గ్రేసు… జై చిరంజీవా. జగదేకవీరా.” అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. శత చిత్రాల దర్శకుడు సామాన్యంగా ఎప్పుడూ ఇంతలా ఎవరినీ అభినందించలేదు. అనేక మంది గొప్ప దర్శకులకు గురువైన ఈయన ఖైదీ నంబర్ 150 లో చిరు నటనను చూసి ఓ అభిమానిగా స్పందించడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. చిరు తనదైన డైలాగులు, ఫైట్లు, డ్యాన్సులతో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.