లారెన్స్… హారర్ తో పాటూ మాస్ కూడానా..?

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో అయిన రాఘవ లారెన్స్ గత కొన్ని సంవత్సరాలుగా ‘ముని’ సీక్వెల్స్ తో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి భాగమైన ‘ముని’ యావరేజ్ గానే ఆడింది. కానీ అటు తరువాత వచ్చిన ‘కాంచన (ముని 2)’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భయపెడుతూనే నవ్విస్తూ… కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ చిత్రం. ఇక ‘గంగ’ ( ముని3 కాంచన2) చిత్రం కూడా మంచి విజయాన్నే నమోదు చేసింది.ఇక ఈ ‘ముని 4’ గా వస్తున్న ‘కాంచన 3’ ను ‘సన్ పిక్చర్స్’ సంస్థ నిర్మించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

kanchana3-movie-trailer-review1

kanchana3-movie-trailer-review2

‘కాంచన 3’ ట్రైలర్లో లారెన్స్ సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో మెరిసిన గడ్డంతో వయసు మళ్ళిన పాత్రలో కనిపిస్తున్నాడు. ఇందులో కూడా రెండు విభిన్న పాత్రల్లో లారెన్స్ కనిపించబోతున్నట్టు స్పష్టమవుతుంది. సాధారణంగా కాస్త రజినీకాంత్ ను ఎక్కువగా ఇమిటేట్ చేస్తున్నట్టే లారెన్స్ యాక్టింగ్ ఉంటుందనే కామెంట్ ఎప్పుడూ ఉండేదే. ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ కలుగక మానదు. ఈ చిత్రంలో ‘జిల్’ ఫేమ్ కబీర్ సింగ్ విలన్ గా కనిపిస్తున్నాడు.హారర్ ఎలిమెంట్స్ తో పాటూ మాస్ ఎలిమెంట్స్ ను కూడా ఈ ట్రైలర్లో చాలా ఇరికించాడు. ‘నువ్వు మాస్ అయితే నేను డబుల్ మాస్ అయితే నేను డబుల్ మాస్’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. మరి ఈ సమ్మర్లో ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి..!

Share.