మళ్ళీ సంచలన కామెంట్స్ చేసిన రాధికా ఆప్టే!

రాధికా ఆప్టే చేసే సినిమాలే కాదు.. కామెంట్స్ కూడా సంచలనానికి దారి తీస్తాయి. ధోనీ, రక్తచరిత్ర, లెజెండ్‌, లయిన్ చిత్రాలతో తెలుగు వారికి పరిచయమైన ఈ బ్యూటీ గతంలో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లని హీనంగా చూస్తారని చెప్పి వార్తల్లో నిలిచింది. అప్పటి నుంచి తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న రాధికా ఆప్టే తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.  దక్షిణాదికి చెందిన ఓ నిర్మాత తనను పడక గదిలోకి రమ్మని పిలిచాడని చెప్పి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది.

“దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్లను పడక గదికి రమ్మని పిలిచే లావాటు ఉందని విన్నాను. నాకు ఆ అనుభవం ఎదురైంది. స్టోరీ డిస్కషన్ లకు పిలిచిన ఓ నిర్మాత నన్ను పడక గదికి రావాలని ఒత్తిడి తెచ్చాడు. అందుకు నేను అంగీకరించలేదు. ఈ కారణం వల్లే   దక్షిణాదిలో అవకాశాలు రావడం లేదు” అని రాధిక వెల్లడించింది. బాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోవడంతో ఏమి చేయాలో తెలియక రాధికా ఇలా వివాదాస్పద కామెంట్స్ చేస్తోందని సినీ ప్రముఖులు చెబుతున్నారు.

Share.