రారండోయ్‌ వేడుక చూద్దాం టైటిల్ సాంగ్ టీజర్ | నాగచైతన్య | రకుల్‌ప్రీత్‌

యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’. ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు, సంపత్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ మే లోనే సమ్మర్‌ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత అక్కినేని నాగార్జున మాట్లాడుతూ – ”నాకు బాగా నచ్చిన రొమాంటిక్‌ ఫిలింస్‌ నిన్నే పెళ్లాడతా, మన్మధుడు. ఫ్యామిలీ లవ్‌, ఎమోషన్స్‌ సీన్స్‌ ‘నిన్నే పెళ్లాడతా’లో చూపించాం. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సెన్సిటివ్‌ లవ్‌ని ‘మన్మధుడు’లో చూపించాం. ఆ రెండు మిక్స్‌చేసి కళ్యాణ్‌ ఫెంటాస్టిక్‌ సబ్జెక్ట్‌ చెప్పాడు. నేను ఏదైతే అనుకున్నానో కరెక్ట్‌గా ఆ రేంజ్‌లో కథ రెడీ చేశాడు. అలాగే తెరకెక్కించాడు. ఈ సందర్భంగా రారండోయ్‌ వేడుక చూద్దాం టీం టైటిల్ సాంగ్ టీజర్ ని విడుదల చేసారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.