మీడియా పై పూరీ జగన్నాథ్‌ కూతురు పవిత్ర సంచలన వాఖ్యలు!!

టాలీవుడ్ లో డ్రగ్ స్క్యామ్ కొందరికి కొత్త కొత్త చిక్కులు తెచ్చిపెడుతుంది…ఏది నిజమో, ఏది అబద్దమో తెలీదు కానీ…మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ మ్యాటర్ లో బడా బాబులు చిక్కుకున్నట్లు మాత్రం మీడియా సాక్షిగా అర్ధం అయిపోతుంది. ఇదిలా ఉంటే మీడియా బయటపెట్టిన వాళ్ళలో సినిమా ఇండస్ట్రీ కి చెందిన మహామహులు చాలా మందే ఉన్నారు అందులో పేరు జగన్నాధ్ ఒకడు…తాను డ్రగ్స్ తీసుకున్నాడో…లేదో తెలీదు కానీ…పూరీ వ్యవహారశైలి శైలి మాత్రం కాస్త అనుమానాలను రేకెత్తిస్తుంది. ఇదిలా ఉంటే దీనిపై పూరీ పూర్తి క్ల్యారిటీగా రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ…పూరీ కూతురు పవిత్ర మాత్రం మీడియా పై ఫుల్ ఫైర్ మీద ఉన్నారు…మ్యాటర్ లోకి వెళితే…టాలీవుడ్ డ్రగ్ స్కాం లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు.. టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాధ్ అవ్వడంతో దానిపై పూరి కూతురు పవిత్ర ఈ ఘాటుగా స్పందిస్తూ…

ఓ కుటుంబం కలిగిన వ్యక్తిపై ఇలాంటి వార్తలు రాయడం సరికాదు.. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా మీమీద ఇలాంటి ఆరోపణలు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి.. నాన్న ఓ సెలబ్రిటీ ఇష్టమొచ్చినట్టుగా రూమర్స్ రాయడం సరి కాదని చెడామడా వాయించేసింది పూరి తనయ పవిత్ర. తన తండ్రి గురించి ఎవరో ఏదో రాస్తే అదే నిజమవుతుందా.. తానెప్పుడు కొన్ని లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటి కోసమే తపన పడతాడని అంటుంది పవిత్ర. తండ్రి మీద తనకున్న ప్రేమకు అందరు భలే అంటున్నారు. ఆమె ఆవేశంలో అర్ధం ఉంది కానీ…పూరీ నిజంగా తప్పు చేసి ఉండక పోతే మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వొచ్చుగా…ఇలా బిజీ అని ట్వీట్ చేస్తూ లేనిపోని అనుమానాలను రేకెత్తించడం ఎందుకు అంటున్నారు టాలీవుడ్ సర్కిల్స్ వాళ్ళు…మరి ఈ వివాదం ఎక్కడ క్లోస్ అవుతుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.