ఆనందంలో హాస్యనటుడు పృధ్వీ

హాస్యనటుడు థర్టీ ఇయర్స్ పృధ్వీ ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారు. ఖైదీ నంబర్ 150 మూవీకోసం తాను నటించిన సీన్  తొలిగించారని కొన్నిరోజుల క్రితం పృధ్వీ బాధపడ్డారు. నిడివిని తగ్గించే చర్యల్లో భాగంగా తాను నటించిన సీన్ కట్ చేశారని ఏడ్చినంత పనిచేశారు. “మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టమైతే, దానికి తొలిగించడం దురదృష్టం. సంక్రాంతికి నా తల్లి చచ్చిపోయినంత బాధ కలుగుతోందని” సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో మీడియాలో దీనిపై అనేక చర్చలు కొనసాగాయి.

తాజాగా ఈ గొడవలన్నీ సమసిపోయాయి. పృధ్వీ బాధను అర్ధం చేసుకున్న చిరంజీవి తొలిగించిన సీన్ యధావిధిగా ఉండేలా డైరక్టర్ వినాయక్ కు చెప్పడంతో ఆయన కట్ చేసిన సీన్ ని కలిపారు. రైతుల సమస్యలపై వినతిపత్రం ఇచ్చే సీన్ లో మంత్రిగా పృధ్వీ, ఆయన పీఏ గా దువ్వాసి మోహన్ కనిపిస్తారు. ఈ సీన్ ఖైదీ నంబర్ 150 మూవీలో ఉంది. చిరుతో కలిసి ఉన్న ఫ్రేమ్ చూసుకుని పృధ్వీ ఫుల్ హ్యాపీ అయిపోయాడంట.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.