హాలీవుడ్ లో ఆఫర్లు లేక బాలీవుడ్ కి రిటర్న్ అవుతున్న ప్రియాంక

నిన్నమొన్నటివరకూ హాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్నాయన్న నమ్మకంతో అక్కడే నివసిస్తూ.. అక్కడి మ్యాగజైన్స్ అన్నిటికీ వరుసబెట్టి హాట్ హాట్ ఫోటోషూట్స్ కూడా చేసింది. మొదట్లో రెండు మూడు ఆఫర్లు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక్క సినిమా మాత్రమే ఉంది. ఇక తాను ఎన్నో ఆశలు పెట్టుకొన్న “క్వాంటికో” సెకండ్ సీజన్ తోనే ఆగిపోవడంతోనే హాలీవుడ్ లో ఇంక చేసేదేమీ లేక మళ్ళీ బాలీవుడ్ వైపు చూస్తోంది. ఆల్రెడీ సల్మాన్ ఖాన్ సరసన “భరత్” అనే సినిమా సైన్ చేసిన ప్రియాంక చోప్రా ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ లాంటి తన స్నేహితులందర్నీ కదుపుతోంది.

ఆ పరిచయాలను వాడుకొని మళ్ళీ బాలీవుడ్ లో తన హవా కొనసాగించేందుకు ప్రియాంక సంసిద్ధమవుతోంది. ఆల్రెడీ అక్షయ్ కుమార్ తదుపరి చిత్రంలో అవకాశం అందుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సొ, బాలీవుడ్ లో మళ్ళీ రీఎంట్రీ అనేది ప్రియాంకకు పెద్ద కష్టమైన పనేమీ కాదు. కానీ.. ఎన్నో ఆశలు పెట్టుకొన్న హాలీవుడ్ కేవలం మూడు సినిమాలతోనే తనను వెనక్కి పంపించేయడం, ఆ మూడు సినిమాల ఆఫర్ల కోసం దాదాపు 15 మ్యాగజైన్లకు ప్రియాంక సూపర్ హాట్ ఫోటోషూట్స్ పేరిట అందాలు ఆరబోయడం, ఆ ఆరబోసిన అందాలు ఇంటర్నెట్ లో ట్రెండ్ అవ్వడానికి తప్ప తన కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడకపోవడం ప్రియాంకను ఎక్కువగా బాధపెడుతోంది.

Share.