7వ సారి మహేష్ కు విలన్ గా ప్రకాష్ రాజ్

మహేష్ బాబు తాజా చిత్రం “సరిలేరు నీకెవ్వరు” నుంచి కుటుంబ సమస్యల కారణంగా జగపతిబాబు తప్పుకొన్న విషయం తెలిసిందే. తొలుత జగపతిబాబుకి పాత్ర నచ్చకపోవడం వల్ల తప్పుకొన్నాడు అని వార్తలు వచ్చినప్పటికీ.. నిన్న విడుదలైన జగ్గూ భాయ్ క్లారిఫికేషన్ వీడియోతో మొత్తం క్లియర్ అయ్యింది. నిజానికి జగ్గూ భాయ్ ఈ చిత్రంలోని క్యారెక్టర్ కోసం మరో రెండు సినిమాలు కూడా వదులుకొన్నాడట. అయితే.. ఆఖరి నిమిషంలో జగపతిబాబు తప్పుకోవడంతో ఆయన స్థానంలో ప్రకాష్ రాజ్ ఆన్ బోర్డ్ అయ్యాడు.

sarileru-neekevvaru-makers-replace-jagapathi-babu-with-prakash-raj1

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పోషించబోయేది కామెడీ విలన్ రోల్. చూడ్డానికి పవర్ ఫుల్ గా ఉంటుంది కానీ.. చాలా సరదా రోల్ అంట. ఆ తరహా పాత్రలు పోషించడంలో స్పెషలిస్ట్ అయిన ప్రకాష్ రాజ్ ఆ పాత్రలో విలనిజంతోపాటు కామెడీ కూడా వీర లెవల్లో పండిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే.. ప్రకాష్ రాజ్ మన మహేష్ కి విలన్ గా నటించడం ఇది 7వ సారి. ఇదివరకు “ఒక్కడు, అర్జున్, పోకిరి, సైనికుడు, ఖలేజా, బిజినెస్ మ్యాన్” చిత్రాల్లో ప్రకాష్ రాజ్ విలన్ గా మహేష్ తో ఢీకొన్నాడు.

Share.