ప్రభాస్ 19 మూవీలో భారీ యాక్షన్ ఎపిసోడ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బహుబలి చిత్రంతో రేంజ్ మారిపోయింది. ఆయన సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగా నిర్మాతలు బడ్జెట్ ని పెంచుతున్నారు. బాహుబలి కంక్లూజన్ తర్వాత డార్లింగ్ చేస్తున్న మూవీ బడ్జెట్ వందకోట్ల నుంచి 150 కోట్లకు చేరింది.  “రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న ఈ ఫిల్మ్ ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్ బ్యానర్లో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్ర పోషించనున్నారు. ఎక్కువ భాగం దుబాయి లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రంలో ప్రభాస్ చేసే సాహసాలు జేమ్స్ బ్యాండ్ ని తలపిస్తాయని తెలిసింది.

ముఖ్యంగా ఈ చిత్రంలో ఆకాశములో ఒక ఫైట్ ని ఉంటుందంట. హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ తో చిత్రీకరించనున్న ఈ యాక్షన్ సీన్ కోసం 35 కోట్లు కేటాయించారని తెలిసింది. ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఈనెల 23 న రిలీజ్ కానుంది. ఈ టీజర్ బాహుబలి కంక్లూజన్ సినిమా రిలీజ్ అవుతున్న 28 వతేదీ  విడుదల కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.