మహానుభావుడు కోసం రానున్న ప్రభాస్!

సంక్రాంతి పండుగప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణతో పోటీకి దిగిన శర్వానంద్ ఈ సారి సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తలపడనున్నారు. దసరా సందర్భంగా  ‘జై లవ కుశ’ సెప్టెంబర్ 21న వస్తుండగా, ‘స్పైడర్’ 27న థియేటర్లోకి రానుంది.  ‘స్పైడర్’ విడుదలైన రెండు రోజులకే అంటే  సెప్టెంబర్ 29న శర్వానంద్ నటించిన ‘మహానుభావుడు’ కూడా రిలీజ్ కానుంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటించింది. జై లవకుశ, స్పైడర్ పోటీలో నిలబడాలని మహానుభావుడు చిత్ర నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు గట్టిగానే ప్రచారం చేస్తున్నారు.

ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రభాస్ ను ఆహ్వానించారని సమాచారం. ప్రభాస్ కి వంశీ, ప్రమోద్ లు చాలా క్లోజ్ కనుక.. అడగగానే ఒప్పుకున్నారని తెలిసింది. ఆడియో రిలీజ్ వేడుక వేదిక, తేదీని రేపు నిర్మాతలు వెల్లడించనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.