తాప్సి ఆహ్వానాన్ని మన్నించిన ప్రభాస్

మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్, తాప్సి కలిసి నటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇక్కడ విజయాలు లేక బాలీవుడ్ కి తాప్సి వెళ్ళిపోయినప్పటికీ అప్పుడప్పుడు ప్రభాస్ ని మీట్ అవుతూనే ఉంది. చాలాకాలం తర్వాత తాప్సి తెలుగులో హారర్ కామెడీ మూవీ ఆనందో బ్రహ్మ మూవీ చేసింది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్ కి విశేష స్పందన లభించింది.  ఈనెల 14న పార్క్ హాయత్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరపాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది.

ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ప్రభాస్ ని తాప్సి ఆహ్వానించినట్లు తెలిసింది. ప్రస్తుతం సాహో సినిమాలో యాక్షన్ సీన్ కోసం ప్రభాస్ ముంబై లో ఉండి సాధన చేస్తున్నారు. గత నెల రోజులుగా పబ్లిక్ ఫంక్షన్స్ కి దూరంగా ఉన్న ప్రభాస్ తాప్సి వచ్చి పిలవగానే ఒప్పేసుకున్నట్లు ఫిలింనగర్ వాసులు చెబుతున్నారు. ఇది నిజమైతే ఆనందో బ్రహ్మ మూవీకి భారీ ఓపెనింగ్స్ రావడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.