ప్రభాస్ అభిమానాన్ని చూసి మురిసిపోయిన శ్రద్ధా కపూర్!

విశిష్ట అతిథి మన ఇంటికి వస్తే ఆనందంతో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మర్యాదగా చూసుకుంటాం. అలాగే ప్రభాస్ బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ ని చూసుకున్నారు. ఈ బ్యూటీ తొలిసారి తెలుగులో సాహో సినిమా చేస్తోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా నటిస్తోంది. మొన్నటి వరకు రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ సీన్ చిత్రీకరించిన చిత్ర బృందం నేడు అమీర్ పేట లోని ఓ ఇంటి సెట్ లో ప్రభాస్, శ్రద్ధ కపూర్ లపై రొమాంటిక్ సీన్ షూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తొలి రోజు సాహో సెట్ లో అడుగుపెట్టింది. దీంతో శ్రద్ధ కపూర్ కు తెలుగు వారి గౌరవ మర్యాదలు ఎలా ఉంటుందో ప్రభాస్ శాంపిల్ చూపించారు.

లంచ్ లోకి ఆమె కోసం 18  రకాల హైదరాబాదీ వంటకాలను సిద్ధం చేయించారు.  ఆ వంటకాలను చూసి శ్రద్ధా ఆశ్చర్యపోయింది. డైటింగ్ ని పక్కన పెట్టి అన్నింటినీ రుచి చూసింది. ప్రభాస్, చిత్ర బృందం తనపై చూపించిన అభిమానానికి శ్రద్ధ ఆనందపడింది. ఆ వంటకాలను  ఫోటో తీసుకొని తన మిత్రులతో పంచుకుంది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.prabhas-surprises-shraddha-kapoor


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.