టీజర్ లోనే సినిమా చూపించేశాడుగా, ఇరగ్గొట్టావ్ సుజీత్

ఇండియన్ ఆడియన్స్ అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సినిమా “సాహో”. “బాహుబలి” లాంటి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అనంతరం ప్రభాస్ నటించిన సినిమా కావడంతో సాధారణంగానే అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. ఇంకా బోలెడుమంది బాలీవుడ్ ఆర్టిస్టులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి “రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ దర్శకుడు. “సాహో” ఆగస్ట్ 15, 2019న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా నేటి నుంచి ప్రమోషన్స్ ను ప్రారంభించారు. నేడు (జూన్ 13) సినిమా టీజర్ ను విడుదల చేశారు.

saaho-movie-teaser-review1

saaho-movie-teaser-review2

టీజర్ మొత్తానికి జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ & ప్రభాస్ లాస్ట్ లో చెప్పిన “డైహార్డ్ ఫ్యాన్స్” డైలాగ్ హైలైట్ గా నిలిచాయి. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ & గ్రాఫిక్స్ వర్క్ తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇదివరకెప్పుడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ స్క్రీన్ ప్రెజన్స్, విలన్స్ గా జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్ ల స్క్రీన్ ప్రెజన్స్ కూడా చాలా రిచ్ గా ఉంది. అన్నిటికీ మించి టీజర్ లో కనిపించిన “మ్యాడ్ మ్యాక్స్” రిఫరెన్స్ తో కూడిన యాక్షన్ బ్లాక్స్ & చేజ్ సీన్స్ కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీజర్ ఎండ్ లో చూపించిన ప్రభాస్ ఫైనల్ బ్లాక్ మాత్రం మాస్ ఆడియన్స్ కోసం క్రియేట్ చేసిన పక్కా పైసా వసూల్ సీక్వెన్స్ లా ఉంది.

saaho-movie-teaser-review3

షేడ్స్ ఆఫ్ సాహో అంటూ విడుదల చేసిన వీడియోస్ తోనే అంచనాలు పెంచేసిన ఈ చిత్రం టీజర్ తో ఆ అంచనాలను ద్విగుణీకృతం చేసింది. చూస్తుంటే.. ప్రభాస్ కెరీర్ లోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలోనే సాహో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేలా ఉంది. సో, ఇకపై ట్రైలర్ & సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేయడం, గుర్తొచ్చినప్పుడల్లా సాహో టీజర్ ను ఒకటికి రెండుసార్లు చూసి గూస్ బంప్స్ ను ఎంజాయ్ చేయడం మన తెలుగు సినిమా అభిమానుల దినచర్యగా మారిపోతుందేమో. ఇకపోతే.. కేవలం ఒకే ఒక్క సినిమా తీసిన ఎక్స్ పీరియన్స్ ఉన్న సుజీత్ “సాహో” లాంటి భారీ బడ్జెట్ యాక్షన్ ఫిలిమ్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడోనని భయపడిన వాళ్లందరికీ కాస్త గట్టి సమాధానమే ఇచ్చాడు సుజీత్.

Share.