ఆ దేశ ప్రజలకి ప్రభాస్ సర్ప్రైజ్..?

‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పడు ప్రభాస్ సినిమా అంటే మూడు, నాలుగు భాషల్లో తెరకెక్కాల్సిందే. ఇక ‘బాహుబలి’ ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు వచ్చింది. జపాన్ ప్రేక్షకుల నుండీ కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. జపాన్ ప్రజలు ‘బాహుబలి’ చిత్రాన్ని వారి సొంత సినిమాలకంటే ఎక్కువగా ఆదరించారు. ముఖ్యంగా ప్రభాస్ గ్లామర్, యాక్టింగ్ తో అక్కడి జనాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. దీంతో ఇప్పుడు ఆ దేశ ప్రజల కోసం ప్రభాస్ ఓ సర్ప్రైజ్ సిద్ధం చేశాడట.

వివరాల్లోకి వెళితే… సుజీత్ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’ ని జపాన్ లో కూడా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడట ప్రభాస్. దీంతో పాటూ.. సినిమా ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా ప్రభాస్ జపాన్ వెళ్ళనున్నాడని ప్రభాస్ సన్నిహిత వర్గాల సమాచారం. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో చిత్రం నిర్మితమవుతుంది కాబట్టి దీనికి నిర్మాతలు కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. శ్రద్ధాకపూర్ నటిస్తున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా కనిపించనున్నాడు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Share.