ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రం పై కేసు నమోదు..!

2011 లో విడుదలైన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రభాస్, కాజల్, తాప్సి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్ర కథ తనదేనంటూ తాజాగా రచయిత్రి శ్యామలాదేవి కోర్టును ఆశ్రయించారు. ‘నా మనసు కోరింది నిన్నే’ అనే నవలని ఆమె రచించిందట.. దానినే కాపీ కొట్టి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ గా రూపొందించారట. అందుకే ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ విషయం పై వెంటనే రియాక్ట్ అయిన న్యాయస్థానం వెంటనే ఆదేశాల జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్, మాదాపూర్ పోలీసులు నిర్మాత దిల్ రాజుకు సమన్లు కూడా పంపారు.

అప్పటినుండీ కోర్టు పరిధిలో ఉన్న ఈ వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రం ‘నా మనసు కోరింది నిన్నే’ నవలకు కాపీయేనని హైదరాబాద్ సివిల్ కోర్టు నిర్ణయించింది. ఇక ఈ విషయం పై శ్యామలాదేవి మీడియాతో మాట్లాడుతూ… ” ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రంలోని ప్రతి పాత్ర నా నవల నుండీ కాపీ కొట్టిందే..! అప్పట్లో ఈ విషయం దిల్ రాజుతో మాట్లాడాలని ప్రయత్నించినా ఆయన కలిసేందుకు సుముఖత చూపలేదు. అయితే, కోర్టు తీర్పు విషయంలో పూర్తి స్పష్టత, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Share.