ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ ఇస్తున్నారా… వార్నింగ్ ఇస్తున్నారా..?

తమ అభిమాన హీరో సినిమా కోసం దాదాపు 2 ఏళ్ళ నుండీ ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు. దీంతో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’ పై భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. వారి అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయనడానికి తాజాగా చిత్ర బృందం నుండీ విడుదల చేసిన టీజర్ అప్డేటే ఇందుకు ఉదాహరణ. విషయం ఏంటంటే.. ఈ టీజర్ అలా ఉండాలి… ఇలా ఉండాలి అంటూ… ఏకంగా సినిమా ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్ కి సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

‘యువీ క్రియేషన్స్’ సంస్థకు సోషల్ మీడియా ద్వారా టీజర్ ఇలా ఉండాలని కండిషన్స్ పెడుతున్నారు. అవి ఎలా అంటే.. ‘సినిమా హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి టీజర్లో యాక్షన్ సన్నివేశాల తాలూకు ఛాయలు స్పష్టంగా కనబడాలట, అవి కూడా ఇంటర్నేషనల్ లెవల్లో ఉండాలట. ముఖ్యంగా ప్రభాస్ పాత్ర వీర లెవల్లో ఎలివేట్ అవ్వాలట. ప్రభాస్ స్టైల్, యాటిట్యూడ్ కొత్తగా కనబడాలని, మధ్యలో రెండు మూడు పవర్ఫుల్ డైలాగ్స్ కూడా పడాలని, మొత్తం మీద టీజర్ చూస్తే బ్లాక్ బస్టర్ పక్కా అనేలా టీజర్ ఉండాలట’. ఓ రకంగా ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారా.. వార్నింగ్ ఇస్తున్నారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. మరి డైరెక్టర్ సుజీత్ వీరి అంచనాలని ఏమాత్రం అందుకుంటాడో చూడాలి..!

Share.