‘సాహో’ లో ప్రభాస్ బైక్ ధర ఎంతంటే..?

‘బాహుబలి’ తరువాత ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఇండియా వైడ్ స్టార్ హీరో అయిపోయాడు. విదేశాల్లో కూడా ప్రభాస్ కు ఓ రేంజ్లో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దీంతో తన తదుపరి చిత్రమైన ‘సాహో’ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ. డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.150 నుండీ 200 కోట్లు బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హాలీవుడ్ నిపుణులు సైతం ఈ చిత్రం కోసం పని చేస్తున్నారంటే ప్రభాస్ స్థాయి ఏంటనేది అర్ధమవుతుంది.

ఇక ఈమధ్య విడుదల చేసిన ఈ చిత్ర మేకింగ్ వీడియోల్లో ప్రభాస్ చాలా స్టైల్ గా కనిపించడంతో పాటూ బైక్ రైడ్ కూడా చేస్తున్నాడు. ఇందుకోసం ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ఎస్ అనే బైక్ ను వాడారంట. ఈ చిత్ర షూటింగ్లో భాగంగా.. దుబాయ్ లో ఈ బైక్ తో కొన్ని యాక్షన్ స్టంట్స్ ను చిత్రీకరించారు. ఇప్పుడు ఈ బైక్ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటి వరకూ అనేక హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ సీన్ల కోసం ఈ బైక్ ను ఉపయోగించారట. ఇంతకీ ఆ బైక్ ధర ఎంతో తెలుసా..? రూ.10.55 లక్షలు. టాలీవుడ్ చిత్రాల్లో ఈ బైక్ పెద్దగా కనిపించనప్పటికీ హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ బైక్ ను ప్రభాస్ కొనుగోలు చేసాడని సమాచారం.

Share.