ప్రభాస్ డైరక్ట్ హిందీ మూవీ ఎప్పుడు చేస్తారు ?

ప్రభాస్ కెరీర్ బాహుబలికి ముందు, తర్వాత అన్నంతగా మారిపోయింది. ఈ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ కాస్త ఇండియన్ స్టార్ అయిపోయారు. డార్లింగ్ తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ నిర్మాతలతో పాటు బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రభాస్ బాహుబలి తర్వాత రెండు సినిమాలు యూవీ క్రియేషన్స్ బ్యానర్లోనే చేయనున్నారు. సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న మూవీ వేగంగా వర్క్ జరుపుకుంటోంది. ఇంకా రాధాకృష్ణ డైరక్షన్లో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అయితే డైరక్ట్ హిందీ మూవీ ఎప్పుడు చేస్తారు? అనే ప్రశ్న అభిమానులను తొలుస్తోంది. ఇదే ప్రశ్నకు ప్రభాస్ తాజాగా సమాధానం చెప్పారు.

బాహుబలి కంక్లూజన్ ఈనెల 28 న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రానాతో కలిసి ప్రభాస్ ఓ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో యాంకర్ “హిందీలో డైరక్ట్ మూవీ ఎప్పుడు చేస్తారు?” అని అడగగా అందుకు ప్రభాస్ స్పందిస్తూ.. “తొందర్లోనే చేస్తాను” అని చెప్పారు. సో సుజీత్, రాధాకృష్ణ  సినిమాలు పూర్తి అయిన తర్వాత ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని ఆయన అభిమానులు  ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.